లెక్క‌లు చేసి పెట్టాల‌ని పోలీసుల‌ను హెల్ప్ అడిగింది ఆ చిన్నారి..!

గణితం… మ్యాథ్స్… ఎలా పిలిచినా ఈ స‌బ్జెక్ట్ అంటే చిన్నారుల‌కు ఒకింత భ‌య‌మే. అయితే భ‌యం సంగ‌తి ప‌క్క‌న పెడితే స్కూల్‌లో టీచ‌ర్ ఇచ్చే మ్యాథ్స్ హోం వ‌ర్క్‌ను చేసేందుకు పిల్ల‌లు నానా తంటాలు ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రు పిల్ల‌లు త‌మ త‌ల్లితోనో, తండ్రితోనో లేదంటే తెలిసిన వారితోనే ఆ వ‌ర్క్ చేయిస్తారు. లేదంటే లెక్క‌ల‌ను సాల్వ్ చేయ‌మ‌ని అడుగుతారు. కానీ… అమెరికాలోని ఓహియోకు చెందిన ఆ చిన్నారి త‌న‌కు హోం వ‌ర్క్ చేయ‌మ‌ని ఇచ్చిన లెక్క‌ల‌ను సాల్వ్ చేయ‌మ‌ని ఎవ‌రిని అడిగిందో తెలుసా..? అదేంటో మీరే చ‌దివి తెలుసుకోండి..!

lena-maths
అమెరికాలోని ఓహియో ప్రాంతంలో లీనా డ్రేప‌ర్ అనే ఓ చిన్నారికి హోం వ‌ర్క్ చేయ‌మ‌ని ఆమె టీచ‌ర్ కొన్ని లెక్క‌ల‌ను ఇచ్చింది. అయితే లీనాకు వాటిని ఎలా చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆమె ఏకంగా ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో స్థానిక పోలీసుల‌ను స‌హాయం కోరింది. త‌న‌కు టీచ‌ర్ ఇచ్చిన లెక్క‌లు రావ‌డం లేద‌ని, త‌న‌కు హెల్ప్ చేయాల‌ని ఓహియో పోలీసుల‌ను మెసెంజ‌ర్‌లో అడగ్గా, వారు అందుకు స‌మాధాన‌మిస్తూ లెక్క ఏంట‌ని అడిగారు. అయితే మొద‌ట లీనా వేసిన ప్ర‌శ్నకు గ్ర‌బ‌ర్ అనే పోలీసు అధికారి స‌మాధానం ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారి హ్యాపీగానే ఫీలైంది. అయితే అంత‌టితో ఆగ‌లేదు. ఆమె మ‌రో లెక్క చేయాల‌ని గ్ర‌బ‌ర్‌ను అడగ్గా… అందుకు కూడా అత‌ను స‌మాధానం ఇచ్చాడు.

ఈ క్ర‌మంలో వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ తాలూకు మెసెంజ‌ర్ స్క్రీన్ షాట్ల‌ను లీనా తండ్రి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టాడు. అది కాస్తా వైర‌ల్ అయింది. దాదాపుగా 23వేల మంది ఆ పోస్టును షేర్ చేశారు. మ‌రి లీనా అడిగిన ఆ లెక్క‌లు ఏమిటో తెలుసా..?  వాటిని మీరు స్క్రీన్ షాట్ల‌లో చూడ‌వ‌చ్చు. లేదంటే కింద ఇస్తున్నాం. అక్క‌డ కూడా చూడ‌వ‌చ్చు..! ఏది ఏమైనా… లెక్క‌లు రాక‌పోతే పోలీసుల‌ను అడగాల‌ని ఆలోచించిన ఆ చిన్నారి బుర్ర‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! దీని గురించి మాత్రం మీ పిల్ల‌ల‌కు తెలియ‌నివ్వ‌కండి. ఎందుకంటే వారు కూడా అలాగే పోలీసులను అడుగుతారు..! అవును మ‌రి. కొత్త త‌రం క‌దా… ఇప్ప‌టి పిల్ల‌లు ఏమైనా చేస్తారు..!

  • లీనా మొద‌టి లెక్క‌: (8+29) x 15
  • రెండో ప్ర‌శ్న‌: (90+27) + (29+15) x 2

Comments

comments

Share this post

scroll to top