చిలక కొట్టిన పండు తియ్యగా ఎందుకుంటుందో తెలుసా?

చిలక కొట్టిన పండు చాలా తియ్యగా ఉంటుంది. ఈ విషయం  మనలో చాలా మందికి తెలిసినదే..ఇంకా చెప్పాలంటే మనకు అనుభవమే. జామ చెట్టెక్కిన ప్రతిసారీ…..చిలకకొట్టిన పండ్లను గమనించి మరీ ….అది కొట్టిన ప్రాంతం వరకు పక్కకు పెట్టి మిగితాది లాగించేస్తాం. అయితే చిలక కొట్టిన పండే ఎందుకు తియ్యగా ఉంటుంది అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే దాని వెనకున్న అసలు లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

The_Pesky_Parrot_-_Vernal_Hanging_Parrot_(9654098096)

అయితే ఇందులో ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే….. చిలుకలు కొట్టిన పండ్లు తియ్యగా ఉండవు, తియ్యగా ఉన్న పండ్లనే చిలుకలు కొడతాయి. కాబట్టి చిలకకొట్టిన ప్రతిపండు తియ్యగా ఉంటుంది. సాధారణంగా చిలుకలు ఎక్కువగా పండ్ల చెట్ల మీదుంటాయి. ఇదే సమయంలో పండ్లను ఇచ్చే ప్రతి చెట్టు.. 5 రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి.. 1. ఆక్సిన్లు      2. జిబ్బరెల్లిన్లు  3. సైటోకైనిన్లు     4. ఇథిలిన్    5. అబ్‌సిసిక్ ఆమ్లం. ఈ అయిదు హార్మోన్లలో ఇథిలిన్ పండ్లను త్వరగా పక్వానికి వచ్చేలా ప్రేరేపిస్తుంది. ఇథిలిన్ ఓ రకమైన వాసనతో ఉంటుంది. చిలుకలు వాటిని కనిపెట్టి…ఇథిలిన్ సహాయంతో  పక్వానికి రాబోతున్న పండును తినే ప్రయత్నం చేస్తాయి. పరిమాణాన్ని బట్టి చిలుక కొంచెం తినగానే….దానికి సరిపోతుంది మిగితాది వదిలిపెడుతుంది. అందుకే చిలకకొట్టిన పండు తియ్యగా ఉంటుంది అనే కంటే తియ్యగా ఉండే పండునే చిలకకొడుతుంది అంటే సరిపోతుంది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top