యూపీలో చికెన్‌, మ‌ట‌న్ బంద్‌… కక్కా ముక్కా లేక ఇబ్బందులు ప‌డుతున్న మాంసాహార ప్రియులు..!

ఆదివారం వ‌చ్చిందంటే చాలు క‌క్కా ముక్కా వండ‌కుండా ఎవరూ ఉండ‌రు. ఎవ‌రి తాహ‌తుకు త‌గిన‌ట్టుగా వారు నాన్‌వెజ్ తెచ్చుకుని వండుకుని ఆర‌గిస్తారు. ఇంకొంద‌రు అవే వంట‌కాల‌ను బ‌య‌ట హోట‌ల్స్‌లో తింటారు. అయితే వారాంతంలోనే కాదు, వారం మ‌ధ్యలో… ఇంకా చెప్పాలంటే రోజూ నాన్‌వెజ్ తినే వారు కూడా ఉంటారు లెండి. ఇంత‌కీ విష‌యం ఏంటీ అంటారా..? ఏమీ లేదండీ ముందే చెప్పాం క‌దా..! మాంసాహార ప్రియుల గురించి, అవును. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న మాంసాహార ప్రియులకు మాత్రం ఇప్పుడు అనుకోని క‌ష్టం వ‌చ్చి ప‌డింది. గ‌త కొద్ది రోజులుగా చికెన్‌, మ‌ట‌న్ కాదు కదా క‌నీసం ఎగ్స్ కూడా దొర‌క‌డం లేదు. దీంతో వారు శాఖాహారంతో అడ్జ‌స్ట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు మాంసాహారం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంత‌కీ జ‌రిగిందేమిటంటే…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌లే ఎన్నిక‌లు జ‌ర‌గ్గా అక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింద‌ని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే యోగి ఆదిత్య‌ను బీజేపీ అధిష్టానం సీఎంగా నియ‌మించింది. దీంతో ఆయన ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ఇచ్చిన వాగ్దానాల‌ను అమ‌లు చేసే ప‌నిలో ప‌డ్డారు. అందులో భాగంగానే సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి యోగి సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ముందు హామీ ఇచ్చిన‌ట్టుగానే ఆయ‌న ఆ రాష్ట్రంలో ఉన్న క‌బేళాల‌న్నింటినీ మూసివేయాల‌ని ఆదేశించారు. దీంతో గ‌త కొద్ది రోజుల కింది నుంచి క‌బేళాల య‌జ‌మానులు ఆందోళ‌న‌కు దిగారు. వారికి చికెన్, మ‌ట‌న్‌, ఎగ్స్ అమ్మే వ్యాపారులు కూడా మ‌ద్ద‌తు ప‌లికారు. దీంతో యూపీలో గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌జ‌ల‌కు చికెన్‌, మ‌ట‌న్‌, ఎగ్స్ ల‌భించ‌డం లేదు.

మాంసాహారం దొర‌క్క‌పోవ‌డంతో యూపీ ప్ర‌జ‌లు శాఖాహారంతోనే సరిపెట్టుకుంటున్నారు. అయిన‌ప్పటికీ స‌ద‌రు వ్యాపారులు మాత్రం త‌మ ఆందోళ‌న‌ను ఆపేది లేద‌ని అంటున్నారు. క‌బేళాల‌ను క‌చ్చితంగా తెర‌వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోతార‌ని, కొన్ని ల‌క్ష‌ల కుటుంబాలు రోడ్డున ప‌డుతాయ‌ని అంటున్నారు. దీంతో యూపీ ప్ర‌భుత్వానికి ఏం చేయాలో అర్థం కావ‌డం లేద‌ట‌. త్వ‌ర‌గా నిర్ణయం తీసుకోక‌పోతే శాశ్వ‌తంగా చికెన్‌, మ‌ట‌న్ దుకాణాల‌ను కూడా మూసేస్తామ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో యూపీ ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏది ఏమైనా ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మాత్రం ఇప్పుడు మాంసాహారం లేదు. శాఖాహ‌ర‌మే దిక్కుగా మారింది..! ప్చ్‌… ఏం చేస్తాం. ఒక్కోసారి అలా జ‌రుగుతుందంతే..!

Comments

comments

Share this post

scroll to top