“రామ్ చరణ్” తో జతకట్టడానికి “శ్రీదేవి” తన కూతురు “జాహ్నవి”కి పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా.?

అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు ,తమిళ,కన్నడ,హిందీ భాషలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.ఎందరో స్టార్ హీరోలతో నటించి తర్వాత పెళ్లి పిల్లలు అంటూ నటనకు దూరం అయిన శ్రీదేవి..ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది.అయితే అందరికి ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీదేవి కూతురు జాహ్నవి ఎంట్రీ ఎప్పుడనేది..శ్రీదేవి కూతురు జాహ్నవి, తెలుగు సినీ పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయం కాబోతోందని ఒకప్పుడు చాలా గాసిప్స్ విన్పించాయి. చరణ్, జాహ్నవి కాంబినేషన్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయడానికి అప్పట్లో చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇప్పుడు దీనిపై ఒక క్లారిటీ వచ్చింది …అదేంటంటే..

శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెలుగులోనూ నటిస్తుందా అన్న ఈ ప్రశ్నకు సమాధానంగా, ‘ఎస్.. వై నాట్ టాలీవుడ్.. తెలుగులోనూ జాహ్నవి సినిమాలు చేస్తుంది..’ అంటూ శ్రీదేవి క్లారిటీ ఇచ్చేసింది. శ్రీదేవి కూతురు జాహ్నవి కోసం తెలుగు పరిశ్రమ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.కానీ, ఇక్కడ శ్రీదేవి చిన్న కండిషన్స్ పెట్టింది… తొలి సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాకే, ఇతర భాషల గురించి ఆలోచించాల్సి వుంటుందట.అంతేకాదు..మంచి కథలు దొరకాలి, మంచి కాంబినేషన్స్ సెట్ అవ్వాలి..’ అంటూ కండిషన్స్ లిస్ట్ చెబుతోంది శ్రీదేవి. అయితే ఇటు కూతురితో పాటు అటు శ్రీదేవి కూడా హిందీలో రీ-ఎంట్రీ ఇచ్చింది.. తమిళంలోనూ నటించింది.. తెలుగు మీదనే శీతకన్నేసింది .

 జాహ్నవి సినీ రంగంలోకి ‘ధఢక్’ అనే సినిమాతో అడుగుపెట్టబోతోంది.తాజాగా ఈ సినిమా ఫస్ట్‎లుక్ కూడా విడుదలైంది. ఈ ఫస్ట్‎లుక్ పోస్టర్‎ని నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. జాహ్నవి కూడా తన ఇన్‎స్టాగ్రామ్ ద్వారా ఈ లుక్ పోస్ట్ చేసింది. ఇందులో హీరో హీరోయిన్లు రొమాంటిక్ లుక్‎తో దర్శనమిస్తుండటం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.. కానీ శ్రీదేవిలా జాహ్నవి  సక్సెస్ అవుతుందో  లేదో  చూడాలి …

Comments

comments

Share this post

scroll to top