చెప్పుల్లో కెమెరాల‌ను పెట్టి అమ్మాయిల‌ను కింద నుంచి వీడియో తీస్తున్నాడు అత‌ను. త‌రువాత ఏమైందంటే..?

స్పై కెమెరాలు.. వీటి వ‌ల్ల లాభం ఎంత ఉందో, నష్టం కూడా అంతేవిధంగా ఉంటుంది. దొంగ‌ల‌ను, నేర‌స్తుల‌ను ప‌ట్టించేందుకు ఈ కెమెరాలు బాగా ప‌నికొస్తాయి. అయితే వీటిని కొంద‌రు మృగాళ్లు మాత్రం వేరే ప‌నుల కోసం వాడుతున్నారు. ఇప్ప‌టికే మ‌నం అనేక సంఘ‌ట‌న‌ల గురించి తెలుసుకున్నాం క‌దా.. షాపింగ్ మాల్స్‌లో, బాత్ రూంల‌లో స్పై కెమెరాలు పెట్టి మ‌హిళ‌లు దుస్తులు మార్చుకుంటున్న‌ప్పుడు వారి వీడియోల‌ను తీసేవార‌ని. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది క‌దా. దాంతో టెక్నాల‌జీ కూడా మారింది. కొత్త కొత్త స్పై ప‌రిక‌రాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. దీంతో మృగాళ్లు కూడా మారారు. స‌ద‌రు నూత‌న త‌ర‌హా స్పై కెమెరాల‌ను పెట్టి మ‌హిళ‌ల‌ను వారికి తెలియ‌కుండా అస‌భ్య‌క‌రంగా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. కేర‌ళ‌లో ఇదే త‌ర‌హాలో వీడియోలు, ఫొటోలు తీస్తున్న ఓ వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

కేర‌ళ‌కు చెందిన బైజు అనే వ్య‌క్తి త‌న చెప్పుల్లో ఓ కెమెరాను ఫిక్స్ చేసుకున్నాడు. అది పైకి ఫేసింగ్ ఉంటుంది. అయితే మామూలుగా చూస్తే చెప్పుల్లో ఉన్న ఆ కెమెరా ఎవ‌రికీ క‌నిపించ‌దు. కొంచెం ప‌రీక్ష‌గా చూడాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే బైజు బాగా ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో అమ్మాయిల‌కు ద‌గ్గ‌ర‌గా తిరిగేవాడు. స్క‌ర్ట్‌లు వంటివి వేసుకున్న‌వారు క‌నిపిస్తే ఇక అత‌నికి పండ‌గే. వారి వెంటే తిరిగేవాడు. త‌న చెప్పుల్లో ఉన్న ఆ కెమెరాతో వారిని కింద నుంచి పైకి వీడియోలు తీసేవాడు. అలా అత‌ను తాను తీసిన వీడియోల‌ను నెట్‌లో పెట్ట‌డం అల‌వాటుగా మార్చుకున్నాడు.

అయితే ఇలాంటి ప‌ని ఎంతో కాలం సాగ‌దు క‌దా. దీంతో బైజు పోలీసుల‌కు దొరికాడు. అత‌ను బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అమ్మాయిల చుట్టూ అదే ప‌నిగా తిరుగుతూ ఉండ‌డాన్ని పోలీసులు గ‌మ‌నించారు. దీంతో అనుమానం వచ్చి అత‌న్ని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించారు. ఈ క్రమంలో బైజు చేస్తున్న పాడు ప‌ని గురించి పోలీసుల‌కు తెలిసింది. దీంతో వారు కేసు న‌మోదు చేసి అత‌న్ని జైలుకు పంపారు. నిజంగా ఇలాంటి కెమెరాల‌ను పెట్టి యువ‌తుల వీడియోల‌ను తీసేవారు ఇంకెంత మంది ఇలా ఉన్నారో. ఏది ఏమైనా ఇలా చేసే వారిని మాత్రం అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌దు.

Comments

comments

Share this post

scroll to top