ఆకలితో కడుపు మాడుతున్నా..మానవత్వాన్ని మరవని కుర్రాడు. సెల్యూట్ రా చెన్నై కుర్రాడా.!

ఎడతెరిపిలేని వర్షం.. చుట్టూ నీళ్లూ… బతుకుతామన్న గ్యారెంటీ లేదు…అప్పటికే తిండి తినక రెండు రోజులు..హెలికాప్టర్ల నుండి పడే ఆహార పొట్లాలకై ఎదురుచూపులు..ఇలాంటి పరిస్థితిలో అక్కడికి ఆహార పొట్లాలను పంచడానికి అతికష్టం మీద చేరుకున్నారు ఇంజనీరింగ్  కుర్రాళ్లు,ఆహార పొట్లాలు పంచుతుండగా… జరిగిన ఓ సంఘటనను చూసి వారంతా తమ తమ ఫేస్ బుక్ లలో ఓ కుర్రాడి ఫోటోను పెట్టి, ఈ కుర్రాడిని చూశాక ఇంకా మానవత్వం బతికే ఉందనిపిస్తుంది. అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ దేశ విదేశాల్లోని నెటీజన్ల చేత శబాష్ రా చిన్నా అని లైక్ లు కొట్టిస్తుంది.

అసలేం జరిగిందంటే….
కొంగు యూనివర్సిటీ నుండి కొంత మంది కుర్రాళ్ళు… వరద బాధితుల సహాయం కోసం… ఆహార పొట్లాలను ప్యాక్ చేసుకొని తీసుకువెళ్లారు. వీరు వెళ్లగానే అక్కడ ఆకలితో ఉన్న చాలా మంది ఒక్కసారిగా ఎగబడ్డారు, వీరు తెచ్చిన ఆహార పొట్లాలు చిటికెలో అయిపోయాయి… ఓ పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా….నాకు అంటూ చేయి చాటాడు, వారు తెచ్చిన బ్యాగ్ ను క్షుణంగా వెతికితే ఓ పాకెట్ దొరికింది దానిని ఆ కుర్రాడికి ఇచ్చేశారు. ఆకలితో ఉన్న ఆ కుర్రాడు ఆ పాకెట్ అక్కడే చించి తినబోతున్నాడు..అంతలోనే మరో పదేళ్ళ కుర్రాడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి..అన్నా నాకు ఇవ్వవా..? ఆకలవుతుంది అని ధీనంగా అడిగాడు… మరోసారి తమ బ్యాగ్ లో వెతికారు కానీ ఈ సారి ఏమీ దొరకలేదు.

12341246_10153134493226790_6203171465429421953_n

దాన్నంతా గమనించిన మొదటి కుర్రాడు తన చేతిలోని పార్సిల్ ను రెండవ పిల్లాడికి ఇచ్చేశాడు.. ఇదేంట్రా అని అడిగితే.. పోనీ..అన్నా…నేను రెండు రోజుల నుండి అన్నం తినలేదు చాలా ఆకలిగా ఉంది, అయినా  పర్వాలేదు నేను ఆకలికి ఓర్చుకోగలను..ఇతను ఆకలిని తట్టుకోలేడు, అందుకే ఇచ్చానన్నా….అని చెప్పిన అతని సమాధానం తర్వాత అతనిని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు ఇంజనీరింగ్ విద్యార్ధులు.

Comments

comments

Share this post

scroll to top