రిపోర్టర్‌ చెంప నిమిరిన గవర్నర్‌? తాకిన చోట మూడుసార్లు సబ్బుతో కడిగానంటూ ఆ రిపోర్టర్‌.!

గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టుంది ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ పరిస్థితి.. పరీక్షల్లో మంచి మార్కులు కావాలంటే ‘తాతను సుఖపెట్టా’లంటూ ఓ మహిళా ప్రొఫెసర్‌ విద్యార్థినిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద దుమారం రేపుతున్నాయి.తాత అనగానే అందరి చూపు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ వైపు మళ్లింది.దానికి తగ్గట్టుగానే ఈ వ్యవహారం పై గవర్నర్ ప్రెస్మీట్ పెట్టడం,అక్కడ జర్నలిస్ట్ తో అసభ్యంగా ప్రవర్తించడం ఆ వ్యాఖ్యలు గవర్నర్ ఉద్దేశించే అనేవి నిజమేనేమో అన్నట్టుగా ఉన్నాయి.

విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోటలోని దేవాంకుర్‌ కళాశాల ప్రొఫెసర్‌ నిర్మలాదేవి వ్యభిచారం చేయాలంటూ విద్యార్థినులను ఒత్తిడి చేస్తున్నట్లు గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆమె స్వరంతో ఉన్న ఆడియోలో… తాతను సుఖపెడితే డిగ్రీలతో పాటు మంచి భవిష్యత్ ఉంటుందని వ్యాఖ్యానించారు.ఆ ఆడియోలో  తాతా అని సంభొదించింది గవర్నర్ ని ఉద్దేశించే అని  గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ రాజీనామాకు డిమాండ్లు మొదలవుతున్నాయి. దీంతో ఉలిక్కిపడిన గవర్నర్‌ మంగళవారం మీడియా సమావేశం పెట్టి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పారు.తాత అంటే తాను కాదనీ, 84 యేళ్ల వయసులో ఉన్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దంటూ ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.తాను రాజీనామా చేసేది లేదంటూ స్పష్టం  చేశారు.

ఇదిలావుంటే, మీడియా సమావేశం ముగిశాక గవర్నర్‌ లక్ష్మీసుబ్రమణ్యన్‌ అనే ఓ మహిళా రిపోర్టర్‌ చెంప నిమిరారు.గవర్నర్‌ స్పర్శ తనకు అసహ్యం కలిగించిందని, ఆయన తాకిన చోట మూడుమార్లు సబ్బుతో కడిగిందంటూ ఆ రిపోర్టర్‌ తన  అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.. ఇది మరింతగా కలకలం రేపడమే కాదు,ప్రొఫెసర్ ఆడియో టేపుల్లో ఉన్న తాత గవర్నరేనా అనే  ఆరోపణలకు ఆజ్యం పోసినట్టయింది.

Comments

comments

Share this post

scroll to top