ప్రేమకు బ్రేక్ వేసిన సాఫ్ట్ వేర్ సంబంధం..అయినా చివరకు ప్రేమదే విజయం.!

గతాన్ని మర్చిపోతూ, భవిష్యత్ ఆలోచిస్తూ  విడిపోదాం అని చెప్పిన అదే అమ్మాయి, గతాన్ని తల్చుకుంటూ, భవిష్యత్ ఆలోచిస్తూ… కలిసి బ్రతుకుదాం అని చెప్పడం మద్య జరిగిన ట్రూ లవ్ స్టోరినే  చెలియా చేజారి వెల్లకే అనే షార్ట్ ఫిల్మ్. 13 నిమిషాల ఈ సినిమాలో మధ్యతరగతి అమ్మాయిల జీవితాన్ని, నిక్కార్సైన అబ్బాయి పంచే  స్వఛ్చమైన ప్రేమను ప్రతి ఫ్రేమ్ లో కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాడు ఈ లఘుచిత్ర దర్శకుడు. ఇందులోని ప్రతి ఒక్క డైలాగ్ గుండెలోపలినుండి, గత జ్ఞాపకాల నుండి వచ్చినట్టు అనిపించింది. ఆ పెయిన్ అనుభవించిన  ప్రతి ఒక్కరికీ ఈ డైలాగ్ లు మనసుకు బలంగా గుచ్చుకుంటాయ్ అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.

తనకంటూ ఓ స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని దాని కోసం పరితపించే ఓ యువకుడు. కట్టుకోబోయే వాడు సెలెబ్రిటీ కానవసరం లేదు ఓ జాబ్ ఉంటే చాలు అనుకునే అమ్మాయిల  వీరిద్దరి ప్రేమకు బ్రేక్ వేసిన సాఫ్ట్ వేర్ సంబంధం. వీటి చుట్టూ కథను తిప్పితూ ప్రస్తుత పరిస్థితిని ఫర్పెక్ట్ గా తెరకెక్కించాడు దర్శకుడు. షార్ట్  ఫిల్మ్స్ లో ఎక్కువగా తెరకెక్కేవి ప్రేమకు సంబంధించిన కథలే అయినప్పటికీ …ఈ చిత్రంలో మాత్రం చాలా డెప్త్  కనిపించింది ఓ మెచ్యురిటీ కనిపించింది. లవ్ స్టోరిలోనే మంచి మెసేజ్ ను చూపించిన దర్శకుడిని, ఈ చిత్ర యూనిట్ ను మనస్పూర్తిగా అభినందిద్దాం.

Plus Points:

  • డైలాగ్స్….డైలాగ్స్…డైలాగ్స్.
  • కెమెరా వర్క్.
  • స్క్రీన్ ప్లే.

Watch Short Film:  Cheliya Chejare Vellake:

Comments

comments

Share this post

scroll to top