అమ్మాయిపై యువ‌కులు గ్యాంగ్ రేప్.. పోస్ట్ మార్టం చేస్తుండ‌గా డాక్ట‌ర్ షాక్.. మ‌ర్మాంగంలోనుంచి ఏం వ‌చ్చాయంటే.?

దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని సంవత్సరాల కిందట ఓ యువతిపై కొందరు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్‌ చేసి దారుణంగా హింసించారు. ఈ ఘటనపై యావత్‌ దేశం ఏకమైన నిరసనలు చేయగా దిగివచ్చిన ప్రభుత్వం ఆ బాధిత యువతి పేరిట నిర్భయ చట్టం తెచ్చింది. ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేసి సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు శిక్ష వేశారు. అంతా బాగానే ఉంది. అయితే ఈ ఘటన అనంతరం వచ్చిన నిర్భయ చట్టం ఇలాంటి ఘటనలను ఎన్నింటిని ఆపగలిగింది అంటే అందుకు సమాధానం లేదు. ఇప్పటికీ ఇలాంటి నిర్భయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అది హర్యానాలో..!

 

హర్యానాలోని జింద్‌ అనే ప్రాంతానికి చెందిన 15 సంవత్సరాల బాలికను అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ధఖేరా అనే గ్రామానికి కొందరు వ్యక్తులు తీసుకెళ్లారు. ఆమెను కిడ్నాప్‌ చేసిన సదరు వ్యక్తులు ఆ గ్రామంలో నిర్మానుష్య ప్రాంతానికి ఆ బాలికను తీసుకెళ్లి ఆమెను దారుణంగా హింసిస్తూ లైంగికంగా దాడి చేశారు. అనంతరం అత్యాచారం చేశారు. తరువాత చంపేశారు. అంతటితో వారు ఆగలేదు. ఆమె శరీరాన్ని చిద్రం చేశారు. అయితే ఈ నెల 9వ తేదీన ఈ ఘటన జరగ్గా తరువాత రోజు తండ్రి తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించడం ప్రారంభించారు.

 

ఈ క్రమంలోనే పోలీసులకు సదరు బాలిక మృతదేహం దొరికింది. ఆ దేహానికి కింది భాగంలో ఎలాంటి దుస్తులు లేవు. పై భాగంలో వేసుకున్న టాప్ చినిగిపోయి ఉంది. ఆమె లివర్‌ను బయటకు తీసి చిద్రం చేశారు. అంతటి దారుణమైన స్థితిలో ఆ బాలిక మృతదేహం పోలీసులకు దొరికింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ బాలికపై అంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని గుర్తించడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే వారికి షాకింగ్‌ నిజాలు తెలిశాయి. ఆ బాలికపై దాడి చేసిన వారిలో ఇంటర్‌ చదువుతున్న ఓ బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితోపాటు మరో ముగ్గురు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇక పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టు కూడా షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. సదరు బాలిక మర్మావయవాలపై దాడి చేశారని, పెద్ద పెద్ద వస్తువులను లోపలికి చొప్పించారని వైద్యులు చెప్పారు. దీంతో పోలీసులు షాక్‌ అయ్యారు. ప్రస్తుతం వారు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఢిల్లీ ఘటన తరువాత అలాంటి దారుణమైన ఘటన ఇదే కావడం గమనార్హం. ఏది ఏమైనా… ఇలాంటి ఘటనలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయంటే.. అందుకు బాధ్యులు ఎవరనేది.. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. వీటిని ఆపాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలపై ఉంది..!

Comments

comments

Share this post

scroll to top