ఎగ‌సిప‌డే జ‌ల‌పాతం ఎక్కుపెట్టిన బాణం – చేగువేరా.!!

విప్ల‌వం అంటే ఏమిటో .చైత‌న్యం అంటే ఎలా వుంటుందో.ఆచ‌ర‌ణ‌లో చూపించిన వాడు. మ‌హోన్న‌త మాన‌వుడు ఉద్య‌మానికి ఊపిరి పోసిన వ్య‌క్తి. పోరాటానికి ప్ర‌తిరూపం.ప్ర‌పంచానికి ఆద‌ర్శం.నిత్య చైత‌న్య‌దీప్తి ఆయ‌న‌. ఎంత చెప్పినా. త‌నివి తీర‌దు.గుండె కొట్టుకోవ‌డం ఆగ‌దు. జ‌ల‌పాతం ఎలా ఉంటుందో.స‌ముద్రం ఎలా ఉప్పొంగుతుందో సునామీ ఎలా ఉంటుందో.ఆయుధాన్ని ధ‌రించిన వాడు.అత‌డే జ‌నం మెచ్చిన యోధానుయోధుడు. కోట్లాది ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు పొందుతున్న పోరాట స్ఫూర్తి – చేగ‌వేరా. అడుగులు వేయ‌డం నేర్పిన వాడు. మ‌నుషుల‌ను ప్రేమించిన వాడు.అంత‌రాలు లేని స‌మాజాల కోసం ప‌రిత‌పించిన మాన‌వ‌తావాది చే. ఆ పేరులో ఏదో మ‌హ‌త్తు ఉంది. ఆ పేరులో ఏదో విద్వ‌త్తు ఉన్న‌ది. ఈ భూమి మీద భౌతికంగా లేక పోయినా. ఆయ‌న భావ‌జాలం ఆయ‌న సిద్ధాంతం ఇంకా సూర్యోద‌య‌మై ఉద‌య‌స్తూనే ఉన్నాడు. ఈ పోరాట వీరుడి గురించి ఆలోచించినా.త‌ల‌చుకున్నా చాలు శ‌రీరంలో ఏదో మ‌హ‌త్తు ఆవ‌హిస్తుంది. ఇంత‌లా పాపుల‌ర్ అయిన నాయ‌కుడు.ప్ర‌పంచంలో ప్ర‌తి చోటా త‌న అస్తిత్వాన్ని నిల‌బెడుతున్నారు.

cheguvera

నిజ‌మైన విప్ల‌వ‌కారుడు గొప్ప ప్రేమికుడై ఉంటాడ‌న్నారు ఓ చోట చేగవేరాచే ఓ విప్ల‌వ ప‌తాక‌మే కాదు.నిలువెత్తు ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు ప్ర‌తిరూపం కూడా. మిలియ‌న్ ప్రేమికుల‌ను ఆయ‌న దాటారు. ట్రిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటుకుని చేగ‌వేరా .వ్యాపార వ‌స్తువై పోయారు. ఇది అత్యంత బాధాక‌రం. చే జీవితమంతా పోరాట‌మే. మ‌నిషిగా పుట్టాడు. మ‌నీషిగా మారాడు. మ‌హోన్న‌తుడిగా ఎదిగాడు. పోరాటం అంటే ఎలా ఉంటుందో.త్యాగానికి చిరునామాగా మారిన చే గురించి ఎంత చెప్పినా త‌క్కువే. లెక్క‌లేన‌న్ని పుస్త‌కాలు.వ‌స్తువులు .వేసుకున్న బ‌ట్ట‌లు.ఇలా ప్ర‌తిదీ ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేస్తూనే ఉన్న‌ది. పిల్ల‌లు, పెద్ద‌లు, మ‌హిళ‌లు, వృద్ధులు, యువ‌తీ యువ‌కులు ఇలా లోకంలోని స‌మ‌స్త‌మంతా ఈ అరుదైన యుద్ధ వీరుడిని త‌మ‌లోని వ్య‌క్తిగా చూసుకున్నారు. త‌మ కుటుంబంలో భాగంగా భావిస్తున్నారు. ఇంత‌లా ఈ లోకంలో చ‌నిపోయినా వెంటాడుతున్న ఒకే ఒక్క నాయ‌కుడు.శిఖ‌ర స‌మానుడు .క్యూబ‌న్.చే గ‌వేరా. పిరికిత‌నానికి దూరంగా.ధైర్యానికి ప్ర‌తీక‌గా నిలిచిన ధీరోదాత్తుడు ఆయ‌న‌. పుస్త‌కాల పురుగు. సైకిల్ మీద సంచారం చేసిన వాడు.ఒక‌రిపై మరొక‌రి పెత్త‌నం ఎందుక‌ని ప్ర‌శ్నించిన వాడు. ఈ ప్రపంచంలోకి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి బ‌తికే హ‌క్కు ఉంటుంద‌ని ఎలుగెత్తి చాటిన వాడు.చేగ‌వేరా.

త‌రాలు మారినా.ఏళ్లు గ‌డిచినా.ఏ దేశానికి వెళ్లినా. అంత‌టా .విశ్వ‌వ్యాపిత‌మై ప్ర‌స‌రిస్తూనే ఉన్నాడు.అల్లుకు పోయాడు. ప్ర‌తి హృద‌యంలో రూప‌మై నిక్షిప్త‌మై పోయాడు.చే.క‌న్నీళ్ల‌ను స్వీక‌రించ‌లేదు.తూటాల‌ను చేతుల్లోకి తీసుకుని ప్ర‌పంచ ప‌టం మీద నెత్తుటి సంత‌కం చేసిన ఘ‌న‌మైన చ‌రిత్ర చే గ‌వేరా. అర్జెంటీనాకు చెందిన ఈ యోధుడికి విప్ల‌వం అంటే పిచ్చి.అంతులేని అభిమానం. నిజ‌మైన మార్క్సిస్ట్.వైద్యుడు.ర‌చ‌యిత‌.మేధావి.గెరిల్లా యోధుడు.సైనిక సిద్ధాంత‌కారుడు క్యూబ‌న్ పోరాటంలో విస్మ‌రించ‌లేని నాయ‌కుడు. విల‌క్ష‌ణ‌మైన రూపం క‌లిగిన ఏకైక విప్ల‌వ శ‌క్తి. ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసిన నాయ‌కుల్లో ఇత‌డొక్క‌డే. అత‌డే చే. మెడిక‌ల్ స్టూడెంట్‌గా ఉన్న గువేరా.లాటిన్ అమెరికా అంత‌టా ప‌ర్య‌టించారు. అక్క‌డ పేద‌రికాన్ని ద‌గ్గ‌రుండి చూశాడు.చ‌లించి పోయాడు చే. ఆ అనుభ‌వంతో ఆర్థిక తార‌త‌మ్యాలు, ఏక‌స్వామ్య పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ‌.నూత‌న వ‌ల‌స వాదం, సామ్రాజ్య‌వాద ఫ‌లిత‌మేన‌ని తుది నిర్ణ‌యానికి వ‌చ్చారు ఆయ‌న‌. అంతులేని అంత‌రాలు పోవాలంటే తిరుగుబాటు ఒక్క‌టేన‌ని భావించారు. జ‌క‌బో ఆర్బెంజ్ గుజ్మ‌న్ ఆధ్వ‌ర్యంలోని గ్వాటిమాల పోరాటాల‌లో పాలు పంచుకునేందుకు ప్రేర‌ణ ఇచ్చింది.

మెక్సికో న‌గ‌రంలో నివ‌సిస్తున్న‌ప్పుడు.ఫిడేల్ కాస్ట్రోను క‌లిశారు చే. క్యూబా నియంత బాటిస్టాను ప‌ద‌వీచ్యుతిని చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. విప్ల‌వ‌కారులో ప్ర‌ముఖుడిగా ఎదిగారు. గ్రాన్మాను అధిరోహించి క్యూబాను ఆక్ర‌మించారు. క్యూబా విప్ల‌వం ప్ర‌పంచాన్ని విస్మ‌యానికి గురి చేసింది. చే ఏర్పాటైన ప్ర‌భుత్వంలో అనేక పాత్ర‌ల‌ను పోషించారు. ఫైరింగ్ ద‌ళాల‌ను స‌మీక్షించ‌డం, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ పెట్టారు. జాతీయ బ్యాంకు అధ్య‌క్షుడిగా.క్యూబా సైనిక ద‌ళాల బోధ‌నా నిర్దేశ‌కునిగా , దౌత్య‌వేత్త‌గా ప్ర‌పంచ దేశాల‌లో ప‌ర్య‌టించారు. ఇండియాను కూడా సంద‌ర్శించారు. ఎక్క‌డికి వెళ్లినా జ‌నంలో అంత‌రాలు ఉండ‌రాద‌ని కోరారు. ఆశించారు. చేగ‌వేరా పోరాట నాయ‌కుడే కాదు అద్భుత‌మైన ర‌చయిత‌. ఆలోచ‌నాప‌రుడు.మేధావి.ఆచ‌ర‌ణాత్మ‌క‌వాది.హేతువాది.నిజ‌మైన క‌మ్యూనిస్టు.సోష‌లిస్టు.హ్యూమ‌నిస్టు.గెరిల్లా యోధుడు.యుద్ధ తంత్రం తెలిసిన సైనికుడు.క‌లం బ‌లం తెలిసిన వ్య‌క్తి.మ‌నుషులంతా స‌మానంగా ఉండాల‌ని.కోరిన అద్భుత‌మైన ప్రేమికుడు.ఆయ‌న‌. నైపుణ్యం క‌లిగిన లీడ‌ర్. యుద్ధ‌తంత్రం ఎలా న‌డ‌పాలో ఆయ‌న‌కు తెలిసినంత‌గా ఇంకెవ్వ‌రికీ తెలియ‌దు.

య‌వ్వ‌నంలో ఉన్న స‌మ‌యంలో చే జ‌రిపిన మోటార్ సైకిల్ యాత్ర .జ్ఞాప‌కాల ఆధారంగా రాసిన పుస్త‌కం .ప్ర‌పంచాన్ని ఊపేసింది. లోకంలో ఉన్న అన్ని భాష‌ల్లోకి అనువాదం జ‌రిగింది. అంత‌గా ఆయ‌న పాపుల‌ర్ అయ్యారు. 1965లో క్యూబాను వ‌దిలారు. కాంగో లో త‌ర్వాత బొలీవియాలోను పోరాటాన్ని ప్రేరేపించారు. ఆ త‌ర్వాత సిఐఏ స‌హ‌కార ద‌ళాల‌తో బంధింప‌బ‌డి.చంప‌బ‌డ్డారు. చేగవేరా గురించి వ‌చ్చిన‌న్ని పుస్త‌కాలు, చిత్రాలు, ఫోటోలు, డాక్యుమెంట‌రీలు, బ‌యో పిక్‌లు, ప్ర‌సంగాలు, రాసిన పేప‌ర్లు, ఆయ‌న వాడిన పెన్నులు, దుస్తులు, క‌ళ్ల‌ద్దాలు, పాట‌లు, వ్యాసాలు, జ్ఞాప‌కాలు లెక్క‌లేన‌న్ని వ‌చ్చాయి.ఇంకా వ‌స్తూనే ఉన్నాయి.ఇంత‌గా ప్ర‌భావితం చేస్తున్న నాయ‌కుడు ఇంకెవ్వ‌రూ ఈ లోకంలో పుట్ట‌లేదు.జ‌న్మించ‌బోరు కూడా.

టైం మేగ‌జైన్ 20 శ‌తాబ్ధ‌పు 100 మంది అత్యంత ప్ర‌తిభావంత‌మైన వ్య‌క్తుల‌లో అత్యుత్త‌మ‌మైన వ్య‌క్తిగా చేగ‌వేరాను పేర్కొంది. అంతేనా అల్బెర్టో కార్టా చే మీద తీసిన ఛాయాచిత్రం.ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌ఖ్యాత ఫోటోగ్రాఫ‌ర్ గా పుర‌స్కారాన్ని స్వంతం చేసుకున్నారు. ఇంట‌ర్నెట్‌లో చే ఓ విప్ల‌వం. కోట్లాది చిత్రాలు.లెక్క‌లేనంత .మోయ‌లేనంత.స‌మాచారం.క‌థ‌లు.కావ్యాలు.క‌విత‌లు.న‌వ‌ల‌లు.జీవిత చ‌రిత్ర‌లు .పాట‌లు.క‌నిపిస్తాయి. చేగువేరా వ్య‌క్తి కాదు.ఈ ప్ర‌పంచానికి అందివ‌చ్చిన నాయ‌కుడు.నిన్న సూర్యోద‌యం.నేడు అరుణోద‌యం.రేపు చెర‌ప‌లేని జ్ఞాప‌కం.కాదంటారా.చే ఐ ల‌వ్ యూ..ఫ‌ర్ ఎవ‌ర్‌.

Comments

comments

Share this post

scroll to top