ఆ పాటను ఓసారి వినండి..మీ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోండి.

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని
నిన్నటి వ్రాతని మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్ళని హితులుగ
తలచి ముందు కెళ్లాలని

కన్నుల నీటిని
కలల సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి
కాంతి పంచాలని

గుండెతో తో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగు తో గమ్యం చెప్పెను నేనున్నానని

నేనున్నానని నీకేం కాదని
నిన్నటి వ్రాతని మార్చేస్తానని

శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని

నేనున్నానని నీకేం కాదని
నిన్నటి వ్రాతని మార్చేస్తానని

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని
నిన్నటి వ్రాతని మార్చేస్తానని

Watch Video Song:

************************************

సినిమా – నేనున్నాను (2004)
సంగీతం – ఎం.ఎం. కీరవాణి
లిరిక్స్ – చంద్రబోస్
గానం – ఎం.ఎం. కీరవాణి, సునీత

Comments

comments

Share this post

scroll to top