ఛీ.ఛీ ..ఇలాంటి షోలు కూడా ఉంటాయా..?

“పిచ్చి ముదిరింది తలకు రోకలి చుట్టమన్నట్టు” తయారైంది టీవీ ఛానెళ్ళ పరిస్థితి. క్రియేటివిటి పేరిట వెర్రివేషాలేయడం…రేటింగ్స్ వేటలో అడ్డగోలుగా వ్యవహరించడం సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే…సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక టీవీ ప్రోగ్రామ్ వీడియోను చూస్తే మీరూ ఇదే మాట అనుకుంటారు..

అప్పట్లో మన తెలుగు ఛానల్ “మా టీవీ” లో “మొగుడ్స్-పెళ్ళామ్స్” అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది.నటులు శివాజీరాజా,సురేఖ వాణి  యాంకర్లుగా నిర్వహించిన ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనే భార్యాభర్తలకు కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించి, ఆ జంటల గురించి అనేకవిషయాల్లో వారి అనుభవాలను,వారి అభిప్రాయాలను చెప్పించేవారు.సేమ్ ఇదే తరహా ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్న ఈ మళయాళి ఛానల్ ప్రేక్షకులకు వెర్రెత్తించే క్రియేటివిటీని ప్రదర్శించింది. ప్రోగ్రామ్ లో పాల్గొన్న జంటలకు ఓ రేంజ్ తిక్కతో కూడిన పోటీ ని పెట్టింది.ఇద్దరు వ్యక్తులు ఆడమగ మధ్య బెలూన్స్ పెట్టి వాటిని ఇద్దరూ కౌగిలించుకుంటూ పగలకొట్టాలి చెప్తుంటేనే అసహ్యంగా ఉంది కదా.ఆ బెలూన్సు పగలగొట్టడానికి వాళ్లు కిందామీదా పడుతున్నారు..పట్టుకోరాని చోట పట్టుకుంటున్నారు.ఇంతకీ వారు భార్యభర్తలో,ప్రేమికులో..లేదంటే అసలు ఏ సంభందం లేనివారో..భార్యభర్తలైతే మాత్రం పబ్లిక్ గా అలా బిహేవ్ చేస్తే బాగుంటుందా..ఈ షోకి జడ్జిలు,యాంకర్, గెస్ట్లు,ఆడియన్స్ అందరూ పగలబడి నవ్వుతున్నారు.

ఛీ అసలు టీవి ఛానెల్స్ ఎందుకు ఇంతగా దిగజారుతున్నాయి.. ఇలాంటి ప్రోగ్రామ్స్ వలన ప్రజలకు ఏం    చెప్పదలచుకున్నారు ..నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు నడిరోడ్డు మీద చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది.ఇప్పుడు మన ఛానెల్స్ చేస్తున్న పని అదే..కుటుంబంతో కలిసి కూర్చుని టివి చూసే పరిస్థితి నేడుందా.అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి..ఈ దరిద్రపు షోలు ఇలాగే కొనసాగితే  ముందు ముందు టివి ఛానెల్లో వచ్చే ప్రోగ్రామ్స్ కి కూడా సెన్సార్షిప్ పెట్టకతప్పని పరిస్థితి దాపురిస్తుందేమో???

Watch Video:

ఇలాంటి షోలు కూడా ఉంటాయా 😂😂😂…

Posted by మన ఊరు మన రాష్ట్రాలు on Tuesday, 3 April 2018

Comments

comments

Share this post

scroll to top