ఊరి తలరాతనే మార్చిన మహిళా సర్పంచ్….ఐరన్ రాడ్లతో ఆమెపై దాడి చేశారు,అయినా లక్ష్యం వీడలేదు.

ఢిల్లీలో ఎంబీఏ పూర్తిచేసిన ఛావి రజావత్, చదువు పూర్తయిన వెంటనే సీనియర్ మేనేజర్ గా మంచి కంపెనీలో చేరింది. నెలకు 80 వేలకు పైగా జీతం, అంతా హ్యాపీగా ఉంది. ఓ సారి పండగకు అలా ఊరెలొద్దామని , తల్లీదండ్రులను, ఊరిని చూసొచ్చినట్టు ఉంటదని బయలు దేరి సొంతూరికి చేరింది ఛావి. చాలా మంది ఇంటికొచ్చి మరీ ఆమెను పలకరిస్తున్నారు… ఏమమ్మా బాగున్నావా..? అంటూ, హా నేను బాగున్నా.. మీరెలా ఉన్నారు అని ఎవ్వర్ని అడిగినా ఒక్కటే సమాధానం… ఊరి పరిస్థితి ఏం బాలేదమ్మా.! తాగడానికి నీళ్ల లేవు, వర్షం వస్తే… మోకాల్ల లోతు దిగే రోడ్లు, రైతుల ఆత్మహత్యలు అంటూ సమస్యలన్నీ పూసగుచ్చారు.


వచ్చిన రోజే ఛావికీ ఊరి పరిస్థితి అర్థమైంది.. వెంటనే తన లాప్ టాప్ తీసి … అక్కడి నుండే తన రాజీనామ లెటర్ ను టైప్ చేసి ఆఫీస్ కు సెండ్ చేసింది. తాను పని చేయాల్సింది కార్పోరేట్ సంస్థలకు కాదు, అభివృద్ది అంటే ఏంటో తెలియని తమ ఊరి ప్రజలకు అని డిసైడ్ అయ్యింది. అందరితో చర్చించి ఆ ఊరికి తానే ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికైంది. ఆడపిల్ల చదువు-దేశానికి వెలుగు అని మన పెద్దలు ఏ సంధర్భంలో అన్నారో గానీ సర్పంచ్ అయిన 4 సంవత్సరాల్లో ఆ ఊరి తలరాతే మారిపోయింది.

నిల్వచేసుకునేందుకు చెరువులను తవ్వించింది.ప్రస్తుతం వ్యవసాయ పద్ధతులను, డ్రిప్ ఇరిగేషన్ రైతులకు వివరించింది. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించింది. ఇళ్ళ పట్టాలను మంజూరు చేయించి, ఇల్లు లేనివారికి సొంతింటికలను సాధ్యం చేసింది. ఇప్పటివరకూ 40కి పైగా రోడ్లు, 800 టాయిలెట్స్ ను ఆ గ్రామంలో నిర్మించింది ఛావి రజావత్. కలుషితమైన నీటిని మంచినీటిగా మార్చేందుకు ఒక సాఫ్ట్ డ్రింక్ సంస్థను ఆహ్వానించి, మంచినీటిని అందించింది.

గ్రామాన్ని ఇలా అభివృధ్ది పథం వైపు పరుగులు పెట్టిస్తున్న ఛావీ జీవితంలో అనుకోని మలుపు…. డెవలప్మెంట్ విషయంలో మంచి జోష్ లో ఉన్న అదే గ్రామంలోని పొలాలపై కొన్ని కంపెనీల కన్ను పడింది. ఆ స్థలాల్లో మేం కంపెనీలు కడతాం అంటూ సదరు సంస్థలు ముందుకొచ్చాయ్… పచ్చని పొలాలు కంపెనీలకు ఇఛ్చేది లేదంటూ అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఛావి రజావత్ పై ఐరన్ రాడ్లతో, కర్రలతో దాడులు చేశారు వాళ్ళు.

అయినా భయపడని ఛావి రజావత్ గ్రామస్థులందర్నీ ఏకం చేసి…. వారిలో చైతన్యం కల్పించి… కంపెనీలను అక్కడి నుండి పరుగులు పెట్టించింది. ఛావీ రాజవత్ సొడా గ్రామానికి చేసిన కృషిని గుర్తించిన ఐక్యరాజసమితిని ఇన్ఫో పావర్టీ సదస్సుకు ఆమెను ఆహ్వానించి, ఆ గ్రామంలో బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు హామీ ఇచ్చింది.

Comments

comments

Share this post

scroll to top