రష్మీ 'చారుశీల' ట్రైలర్. కామెడీ హర్రర్ రెండిటిని మిక్స్ చేసింది.

గుంటూరు టాకీస్ సినిమాలో అందాల అరబోత చేసిందన్న అపప్రదను మూటగట్టుకున్న రష్మీ….అందుకు భిన్నంగా నటనకు స్కోప్ ఉన్న పాత్రతో మనముందుకు రానుంది. రష్మీ ప్రధాన పాత్ర పోషించిన చారుశీల అనే కామెడీ హర్రర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్..ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, బ్రహ్మానందంలు కూడా కీరోల్ లో నటిస్తున్నారు. రాజీవ్ కనకాల రష్మీల మద్య చాలా సీన్లను ఈ ట్రైలర్ లో చూపించారు. దీనిని బట్టి రాజీవ్ రష్మీల మద్యే సినిమా ఆసక్తికరంగా సాగేటట్లు కనిపిస్తుంది.

తెలుగులో కామెడీ హర్రర్ కాన్సెప్ట్ లో వచ్చిన చాలా సినిమాలు హిట్ ను సాధించాయి. తాజాగా రష్మీ అలాంటి సినిమా చేయనుండడంతో ఈ సినిమాకు రష్మీ గ్లామర్ ప్లస్ ఇమేజ్ లు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జబర్ధస్త్ కమెడీయన్లు కూడా కొంత మంది కనిపించారు  ఈ ట్రైలర్ లో……..

Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top