తాగి డ్యాన్స్ చేసిన ఛార్మీ..!

 ఛార్మి ప్రస్తుతం నటిగా సినిమాలు చేయడం తగ్గించి పూరి జగన్నాథ్‌తో కలిసి నిర్మాణ రంగంలో బిజి అయిపోయిన సంగతి తెలిసిందే.బాలకృష్ణతో ‘పైసావసూల్’ చిత్రం చేసిన తర్వాత పూరి చేసిన చిత్రం ‘మోహబూబా’. పైసావసూల్ ప్రొడక్షన్ బాద్యతలను కూడా ఛార్మీనే చూసుకుంది.ఇప్పుడు పూరి తనయుడు ఆకాష్ హీరోగా నటించిన మెహబూబా సినిమాకు ఛార్మీ ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యుసర్ గా పనిచేసింది..ఈ క్రమంలో ఈ సినిమా విడుదలై అపజయం పాలైన సంగతి తెలిసిందే..
కొడుకుని హీరోగా నిలబెట్టాలని,అలాగే తను దర్శకుడిగా నిలదొక్కుకావాలని పూరీ ఎంత ప్రయత్నించినప్పటికి మెహబూబా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇండో – పాక్ యుద్దం నేపధ్యంలో సాగే ఈ కథలో హీరో హీరోయిన్లకు రెండు జన్మలుంటాయని,గత జన్మలో చనిపోయిన ఇద్దరూ ఈ జన్మలో ఎలా కలుసుకున్నారనే ఇతివృత్తంతో సాగే కథ మెహబూబా..ఆకాశ్ నటనకు మంచి మార్కులే పడినప్పటికి సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశపర్చింది..ఇదిలా ఉంటే ఈ సినిమా టీం అంతా ఒక హోటల్లో పార్టీ చేసుకున్నారు.ఆ పార్టీలో మందుకొట్టి తాగి డ్యాన్స్ చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.గతంలో మెహబూబా షూటింగ్ టైంలో కూడా ఛార్మి మందుకొట్టి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలయింది..డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న టాలివుడ్ నటులలో ఛార్మీ,పూరీల పేర్లు ప్రముఖంగా వినపడిన సంగతి తెలిసిందే.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top