ఛార్లీ చాప్లిన్ చెప్పిన జీవిత సత్యం.. అది కూడా ఒక జోక్ తో…!

అతను నవ్వు కు, నవ్వించాడినికి కెరాఫ్ అడ్రస్.. సంపూ స్టైల్లో చెప్పాలంటే  కామెడీకి ఎప్పుడైనా కామెడీ కావాలనిపిస్తే వెళ్లి ఆయన తలుపు కొడుతుంది. ఉపోద్ఘాతాలు అవసరం లేని పేరు ఆయనది. ఆ పేరు చెబితేేనే ఎవరో గిలిగింతలు పెడతుతూ నవ్విస్తున్నారే ఫీల్ కలుగుతోంది.  అతనే  చార్లీ చాప్లిన్.  అలాంటి కామెడీ కింగ్  ఓ స్టేజ్ షోలో జీవిత సత్యాన్ని తన జోక్ కు లింక్ చేసి అందరిని ఏడిపించాడు. అదేంటో మనమూ చూద్దాం!

ఓ స్టేజ్ షో లో నవ్వులను పూయించడానికి వచ్చాడు ఛార్లీ ఛాప్లిన్… మొదట ఓ జోక్ వేశాడు.  దీనికి సభికులందరూ అర్థగంట సేపు ఆగకుండా నవ్వారు.  కాసేపు ఆగి మళ్లీ అదే జోక్ వేశాడు చాఫ్లిన్.. మళ్లీ ఓ అయిదు నిమిషాల పాటు నవ్వేశారు సభికులు. మళ్లీ అదే జోక్ ను రిపీట్ చేశాడు చార్లీ… ఈ సారి ఓ అర నిమిషం నవ్వారు ప్రేక్షకులు.

మళ్లీ… అదే జోక్ ను నాలుగవ సారి కూడా వేశాడు చార్లీ  చాప్లిన్… ఈ సారి ఎవ్వరూ నవ్వలేదు.. సభా ప్రాంగణం అంతా నిశ్శబ్దం. అయినా ఇదేమీ పట్టించుకోకుండా చాప్లిన్ మరోసారి సేమ్ జోక్  ను రిపీట్ చేశాడు. ఈ సారి సభకు వచ్చిన అందరూ తిట్టుకోవడం స్టార్ట్ చేశారంట! చార్లీ చాప్లిన్ కు మెంటలా అంటూ అనుకోవడం స్టార్ట్ చేశారంట!!

Poster advertising Charlie Chaplin's 'The Great Dictator', first released in 1940, c.1945 (colour litho)

అప్పుడు చార్లీ చాప్లిన్.. అందరికి ధన్యవాదాలు. మీరు తిట్టుకునే తిట్లు నాకు వినిపిస్తున్నాయ్, దీని కోసం మరొక్క సారి మీకందరికీ థాంక్స్ అంటూ …. ఒక జోక్ కు  మొదటి సారి నవ్విన మీరు, పదే పదే అదే జోక్ ను రిపీట్ చేస్తుంటే నవ్వడం మాని  తిట్టడం స్టార్ట్ చేశారు. సేమ్ అలాగే ఓ సారి కష్టం వచ్చినప్పుడు మనం ఏడుస్తాం.. మళ్లీ..మళ్లీ అదే కష్టం రిపీట్ అవుతుంటే దానిని చూసి  జయిస్తానని అనుకోకుండా… ఎన్ని సార్లు కష్టం వస్తే అన్ని సార్లు ఎందుకు ఎడుస్తున్నారు. ఇది కరెక్ట్ పద్దతి కాదు. ఎలాగైతే ఒక జోక్ కు వంద సార్లు నవ్వరో అలాగే ఒక కష్టానికి వంద సార్లు ఏడవకూడదు.

గ్రేట్ లైన్ సార్… చార్లీ చాఫ్లిన్ గారు మీకు నవ్వించడమే కాదు, ఏడిపించడం, జనాన్ని జాగృత పరచడం కూడా చాలా బాగా తెలుసు..

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top