చిరంజీవి బర్త్ డే స్పెషల్: ఆయన సినిమాలకు లింక్ అయిన ఓ ఫన్నీ లవ్ స్టోరి!

నాపేరు శంకర్, నన్ను అందరూ ముద్దుగా శంకర్ దాదా అని పిలుస్తారు. నా లవర్ పేరు రాణీ…నేను ముద్దుగా కాసుల రంగమ్మ అని పిల్చుకుంటాను. మా లవ్ కు పునాది రాళ్ళు పడింది.   ప్రాణం ఖరీదు సినిమాలో. చిరంజీవి  యాక్టింగ్ కు  జై చిరంజీవా అంటూ ఈలలేస్తుంటే నా పక్కసీట్లో కూర్చున్న  అమ్మడు ప్లాట్ అయ్యింది. కట్ చేస్తే తెలిసింది మా కాలేజ్ లో వాళ్ళ నాన్న మా మాస్టర్ అని,  పేరుకే ఆయన మాస్టర్ కానీ నిజం చెప్పాలంటే ఆయన ఓ హిట్లర్..

నేను కూడా   మా కాలేజ్ లో గ్యాంగ్ లీడర్.  ఆ పాటికే రెండు చిన్న గొడవల్లో పోలీస్ స్టేషన్  బుక్ లోకి నాపేరు ఎక్కింది. మా లవ్ మ్యాటర్ మా మాస్టర్ మామ కు చెబితే..ఛల్ వాడు ఖైదీ కావాలంటే పోలీస్ స్టేషన్ లో అడుగు ..అయినా రౌడీని అల్లుడుగా చేసుకుంటానా  అంటూ నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసి ఉద్యోగం వస్తేనే పెళ్ళి అన్నాడు.

అప్పుడు మా మాస్టర్ మామా ముందు నేను ఛాలెంజ్ చేశాను, స్వయంకృషితో  ఉద్యోగం సంపాధిస్తా..  ఠాగూర్ ప్రింటింగ్ ప్రెస్ లో…. జగదేక వీరుడి పెళ్ళి అతిలోక సుందరితో అంటూ ఓ శుభలేఖ అచ్చు వేయించుకొని వస్తా అంటూ  కొడితే కొట్టాలిరా పెద్ద జాబ్ అని పాడుకుంటూ బయటికి వచ్చా…!!

పసివాడి ప్రాణంలా అగమ్యగోచరంగా ఉన్న జీవితంలోకి ఆపద్భాందవుడిలా వచ్చాడు మా పక్క ఊరి స్టాలిన్.. నువ్వు డాక్టర్ అవ్వొచ్చురా అంటూ నా చేత ఎమ్సెట్ రాయించాడు. కాలం కలిసొచ్చింది…. దేవుడి కరుణించాడు, నాకు సీటొచ్చింది. లోలోపల నా రాణిని చూడాలని ఉంది అయినా శంకర్ దాదా MBBS అనే ట్యాగ్ లైన్ కోసం రాక్షసుడిలా చదివాను.

చివరకు శంకర్ అయ్యాడు శంకర్ దాదా MBBS… కొదమసింహంలా డాక్టర్ పట్టా పట్టుకొని మా మాస్టర్ మామ దగ్గరికి వచ్చా.. అల్లుడు నువ్వు రౌడీ అల్లుడనుకున్నా కానీ నువ్వు విజేతవి అంటూ రాణీతో నా పెళ్లి చేశాడు. ఆ రోజు రాత్రి ఓరేయ్ నాఘరానా మొఘుడా అంటూ నా రాణి నా బుగ్గపై వెచ్చని ముందోటిచ్చింది. నెక్స్ట్ సీన్ ఏంజరిగిందో చెప్పాలంటే జస్ట్ నాకు సిగ్గేస్తుంది. ఫైనల్ గా పెళ్లి అనే జైలు లో పెళ్లాం చేతిలో బంధీనై  ఖైదీ నెం.150 గా తిరుగుతున్న.


13957580_1071992319505219_698052318_n

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top