ప్రియురాలితో మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు..! లవర్ తో అతని చివరి వాట్సాప్ చాట్ ఇదే..!

ఆత్మహత్య ఎంత ఈజీ అయిపోయింది.. రోజురోజుకి బతుకు ఎంత చిన్నదైపోతుంది.. చిన్న చిన్న విషయాలకే యువకులు ప్రాణాలు తీసుకోవటం కలకలం రేపుతోంది. అరచేతిలోకి అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ లైవ్ సూసైడ్ లకు కారణం అవుతుంది. ప్రేమించిన యువతి దూరం అయ్యిందని.. కన్నవాళ్లకు గర్భశోకం మిగుల్చుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశం అయ్యింది.

ఐటీఐ డిప్లొమా చేస్తున్న అజ్మిరా సాగర్‌(20) ప్రేమించిన యువతి దూరమైందన్న ఆవేదనతో హైదరాబాద్ లోని వినాయక్‌నగర్‌లో గురువారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు.. ప్రియురాలితో వాట్సాప్‌ వీడియో చాటింగ్‌ చేస్తూ ఉరేసుకున్నట్లు యువకుడి మొబైల్ ని పరిశీలించిన పోలీసులు తెలిపారు. రాజమండ్రికి చెందిన యువతి హైదరాబాద్ లో BSC నర్సింగ్‌ చేస్తోంది. సాగర్‌తో పరిచయమైంది. రెండు కుటుంబాలు మందలించడంతో నాలుగు నెలలుగా దూరంగా ఉంటున్నారు. సాగర్‌ పెళ్లి చేయాలని ఇంట్లో పెద్దలు నిశ్చయించారు. దీంతో అతను మనస్తాపానికి గురయ్యాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియురాలితో వాట్సాప్‌లో చాటింగ్‌ చేశాడు. నేను చనిపోతే నువ్వు చూడాలి.. నేను సంతోషిస్తాను.. తొందరగా వీడియో కాల్‌ చెయ్యి.. నేను చనిపోతున్నాను అంటూ ఆ యువతికి మెసేజ్ చేశాడు. దీంతో ఆ అమ్మాయి వీడియో కాల్ లోకి వచ్చింది. ఆ అమ్మాయి చూస్తుండగానే సాగర్‌ చీరను ఉరేసుకుని చనిపోయాడు. వీడియో కాల్‌ బయటపడటంతో ఇద్దరి మధ్య కాల్స్‌ డాటా, వాట్సాప్‌ మెసేజెస్ ఇతర అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.

Comments

comments

Share this post

scroll to top