చనిపోయే 7 రోజు ముందు “గుండు హనుమంతరావు” ఏం చేసారో తెలుసా? డబ్బుపై ఆయన వైఖరి చూస్తే.!

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాద పడుతున్న హనుమంతరావు….ఈమధ్య  ఒక టివి షోలో పాల్గొన్నప్పుడు తన అనారోగ్యాన్ని ప్రస్తావించండంతో అందరికి ఈ విషయం తెలిసింది.. వెంటనే సహనటులు   ఆర్దిక సహాయం చేశారు.ఈ మధ్యనే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు ఇంతలోనే ఇలా జరగడం విషాదం..

ఒరే ఆంజనేయులు తెగ ఆయాసపడిపోకు చాలూ..అంటూ వచ్చే అమృతం సీరియల్లో అంజిగా గుండు హనుమంతరావు ప్రతి ఇంటికి దగ్గరయ్యారు.గుండు హనుమంతరావు 1956లో విజయవాడలో సరోజిని,కాంతారావు దంపతులకు  జన్మించాడు.. చదువు అంతా విజయవాడలోనే సాగింది. అక్కడే 1974లో పద్దెనిమిదేళ్ళ వయసులో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాల్లో ఆయన వేసిన మొట్టమొదటి వేషం.ఒకసారి  ఆయన వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల అహ నా పెళ్లంట సినిమాలో మొదటిసారిగా వేషం ఇచ్చారు. ఆ తర్వాత కొబ్బరిబోండాం,బాబాయిహోటల్ ,యమలీల,మాయలోడు ,భద్ర,గౌతమ్ ఎస్ఎస్ సి లాంటి అనేక సినిమాల్లో నటించారు..గుండు హనుమంతరావు భార్య ఝాన్సీరాని ప్రమాదవశాత్తు కాలుజారి పడి మరణించారు.ఆ తర్వాత కొడుకు విదేశాల్లో చదువు మానేసి వచ్చిఅనారోగ్యంగా ఉన్న తండ్రిని చూసుకుంటున్నారు.

ఆరోగ్య పరంగానే కాదు, ఆర్థికంగానూ గుండు హనుమంతరావు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో మెగాస్టార్ చిరంజీవి ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.2లక్షలు ఇటీవలే అందజేశారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా గుండు హనుమంతరావుకు ఆర్థిక సహాయం అందజేసింది. హనుమంతరావుని కడసారి చూద్దామని వచ్చిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా విలేకరులతో మాట్లాడారు.

ఆరోగ్యం బాగాలేకుంటే, కేసీఆర్, కేటీఆర్, చిరంజీవి వంటి వారెందరో సాయం చేశారని, మొత్తం ఎంత డబ్బు పోగయిందో తాను లెక్కలు చెబితే, “ఇక చాలు, ఆపరేషన్ కు సరిపోతాయి. మరెవరి వద్దా తీసుకోవద్దు” అని ఆయన చెప్పారని, గత మూడు రోజులుగా జరుగుతున్న నాటకోత్సవాలకు ఆయన రాకపోతే, ఆరోగ్యం బాగాలేదని అనుకున్నానే తప్ప, ఇంత సీరియస్ గా ఉందని తనకు తెలియలేదని కన్నీరు పెట్టారు. మధురానగర్ లో తామిద్దరమూ పక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్లమని, గుండు చాలా మంచి వ్యక్తని, అటువంటి వ్యక్తిని కోల్పోవడం తనకెంతో బాధను కలిగిస్తోందని అన్నారు. వారి కుటుంబానికి ‘మా’ అండగా ఉంటుందని చెప్పారు.

భార్య బిడ్డ చనిపోయాక ఆయన మానసికంగా బలహీనులు అయ్యారు. తర్వాత ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఇటీవలే అలీ షోలో “పాతికేళ్లకుపైగా తన కెరీర్ లో సంపాదించిన కోట్లు కరిగిపోయిన వైనాన్ని వివరించి కన్నీళ్లు పెట్టుకున్నాడు”. రెండు కిడ్నీలు దెబ్బతిన్నా సరే ఎవరినీ చేయి చాచి డబ్బు అడగని నైజం కారణంగా వైద్యం ఆగిపోయిన దుస్థితినీ వివరించారు.

అది విన్న ఎంతో మంది సినీప్రముఖులు గుండు హనుమంత రావు ఆపరేషన్ కి విరాళాలు పంపించారు. చిరంజీవి రూ.2లక్షల చెక్కు పంపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.5లక్షల ఆర్థిక సహాయం అందించారు. స్వయంగా గుండు హనుమంతరావుకి ఫోన్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత అమృతం 2 వస్తుందని ఆశించారు అభిమానులు. కానీ ఇంతలోనే ఇలా జరిగింది.

వారం రోజుల ముందు గుండు హనుమంత శివాజీ రాజాకి ఫోన్ చేసి..”వేలాది మంది స్పందనతో డబ్బు వస్తుండడంతో ‘ఇక చాలు.. విరాళాలు తీసుకోకండి’అంటూ గుండు హనుమంతరావు చెప్పి షాక్ ఇచ్చారు. ‘నా వైద్యానికి ఇంతకంటే అవసరం లేదని వైద్యులు చెప్పారు.. ఇదే విషయాన్ని దాతలకు చెప్పి విరాళాలు పంపొద్దని ప్రకటించండని’ శివాజీ రాజాకు స్వయంగా చెప్పారు హనుమంతరావు. డబ్బు వదిలితే వదలని ఎంతో మంది గురించి మనం రోజు వింటూనే ఉన్నాము. అతిగా ఆశ పడకుండా సింపుల్ గా బతికి అందరిని నవ్వించిన గుండు హనుమంత రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

Comments

comments

Share this post

scroll to top