చనిపోయేముందు ఆమె తన భర్తను ఏ కోరిక కోరిందో తెలుసా..? భార్య కోరిక తీర్చడానికి భర్త ఎంత కష్టపడ్డాడు అంటే..!

నిజంగా కొన్ని సార్లు దేవుడు మనిషికి ఎలాంటి పరీక్షలు పెడతాడు.వాటిని తట్టుకుని నిలబడుతున్నాడంటే నిజంగా దేవుడికంటే మనిషే గొప్పవాడు అన్పిస్తుంది.ఈ లోకంలో మనిషికి వచ్చే అతి పెద్ద కష్టం ఏమన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వారి మరణం మాత్రమే..అది కూడా వాళ్లు చావు తప్పదు.కానీ మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు వారిని తీసుకెళ్లిపోతుందో తెలియదు అనుకున్నప్పుడు ఆ మనిషి పడే నరకం అంతా ఇంతా కాదు.సరిగ్గా అలాంటి కష్టమే అనుభవించారు రమేశ్.తన భార్య అజు కోసం ఎంతో బాదపడ్డారు…అసలేమైందో కింద వీడియోలో చూడండి!

భయంకర క్యాన్సర్ తో భాదపడుతూ ఉన్న తన భార్యను రక్షించడానికి చేయాల్సిందంతా చేసాడు..కోచిలోని ఓ హాస్పటల్ లో రెండోసారి కెమోథెరఫి అబ్సర్వేషన్ లో పెట్టారు.ఆమెకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం, మరో నాలుగు రోజుల్లో కోచిలో ఇండియన్ పుట్ బాల్ మ్యాచ్ జరగనుంది.పుట్ బాల్ మ్యాచ్ ఆటగాళ్ళలో ఆత్మ విశ్వాసం నింపడానికి సచిన్ అక్కడకు వస్తున్నాడు అనే విషయం ఆమెకు తెలిసింది.తన అభిమాన క్రికెటర్ సచిన్ కోచి వస్తున్నాడన్న సంగతి ఆమెకు ఆనందాన్ని కలిగించింది.ఎలాగైనా సచిన్ ను చూడాలని ఆ ఫుట్ బాల్ మ్యాచ్ కి తీసుకెళ్లమని తన భర్తను అడిగింది.అయన ఇలాంటి పరిస్థితిలో ఎందుకు మరోసారి తిసుకెళ్తా లే అని చెప్పాడు. కానీ నిజమేంటో అతనికి తెలుసు తనకు మరో అవకాశం రాదని,అందుకే మనసు మార్చుకున్నాడు.ఎలాగైనా భార్య కోరిక తీర్చలనుకున్నాడు.

దానికోసం తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఎలాగైనా టికెట్స్ కావాలని,ఎంత కష్టమైన టికెట్స్ సంపాదించాలని చెప్పాడు. పరిస్థితి దిగజారితే తనను వెంటనే చికిత్సకి తరలించాలి స్టేడియం దగ్గరో ఉన్న హాస్పటల్ కి అంబులెన్స్ లకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళు కావాల్సిన  జాగ్రతలు తీసుకున్నారు. ఆమెను తీసుకొని మ్యాచ్ కి వెళ్ళాడు.వేలాది మంది ప్రేక్షకుల కేరింతా’లు చూసి తెగ ఆనంద పడింది.సచిన్ సచిన్ అనే అరుపులు విని ఆమె భాదనంత మరిచిపోయింది.ఆ సమయంలో ఆయన భార్య ఆయనకి ఎంతో అందంగా కనిపించిందట. రమేష్ తన భార్య కోరిక తీర్చి ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందాడు.కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.కొద్ది రోజులకే రమేష్ భార్య చనిపోయింది.

గత ఏడాది తన భార్య చివరి కోరిక తీర్చిన తీరును ఆ సందర్భంలో కలిగిన ఆనందం,అనుభూతిని ,తన ఫ్యామిలిఫొటోని తన పేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. నా భార్య చాల దైర్యవంతురాలు కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలిసిన దైర్యంగా ఉండేది.జీవితం ఎంతో అందమైనది ప్రతి క్షణం ఆస్వాదించండి.గాడ్ బ్లెస్ యు అంటూ రాసాడు.వారికీ అపురూపంగా పుట్టిన కొడుకును అపురూపంగా చూసుకుంటూ రోజులు గడుపుతున్నానని చెప్పుకోచ్చాడు. భార్య బ్రతికుండగానే నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో రమేష్ లాంటి వాళ్ళు అరుదే కదా.

Comments

comments

Share this post

scroll to top