ఆ యువ‌కుడు చ‌నిపోయాడ‌ని వైద్యులు చెప్పారు. పోస్టు మార్టం చేసేటప్పుడు జరిగింది చూసి డాక్టర్లు షాక్.! అసలేమైంది.?

చ‌నిపోయాడ‌ని వైద్యులు నిర్దారించిన వ్య‌క్తి మ‌ళ్లీ బ‌తుకుతాడా ? ఇది అసాధ్యం క‌దా. ఎక్క‌డా ఇలా జ‌ర‌గ‌దు. వైద్యుల‌కు అన్ని విష‌యాలు తెలుస్తాయి. సాధార‌ణ మాన‌వుల్లా కాదు వారు. అందుకే వారు ఒక్క‌సారి ఎవ‌రైనా వ్య‌క్తి చ‌నిపోయాడ‌ని నిర్దారిస్తే ఇక ఆ వ్య‌క్తి చ‌నిపోయిన‌ట్టే లెక్క‌. దీంతో చ‌నిపోయిన వ్య‌క్తికి అంత్య‌క్రియ‌లు చేస్తారు. అయితే అక్క‌డ అలా జ‌ర‌గ‌లేదు. యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డిన అత‌న్ని చూసి డాక్ట‌ర్లు చ‌నిపోయాడ‌ని అన్నారు. తీరా చూస్తే పోస్టు మార్టం చేయ‌డానికి నిమిషం ముందు లేచాడు. దీంతో చ‌చ్చి బ‌తికిన అత‌న్ని చూసి మొద‌ట అంద‌రూ దెయ్య‌మని భ‌య‌ప‌డ్డారు. కానీ చివ‌ర‌కు అస‌లు నిజం తెలిసే స‌రికి షాక్ తిన్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

నాగ‌పూర్‌లో నివాసం ఉండే హిమాన్షు భ‌ర‌ద్వాజ్ అనే యువ‌కుడు ఎస్‌యూవీ కార్ న‌డుపుతూ ఉండ‌గా అత‌నికి యాక్సిడెంట్ అయింది. కార్ బోల్తా పడ‌డంతో అది పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక ఈ ప్ర‌మాదంలో హిమాన్షుకు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అత‌న్ని నాగ్‌పూర్‌లోనే ఓ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు అత‌న్ని ప‌రీక్షించి చ‌నిపోయాడ‌ని చెప్పారు. త‌రువాత నాగ్‌పూర్ నుంచి చింద్‌వాడకు హిమాన్షును షిఫ్ట్ చేశారు. ఆ ప్రాంతంలో ఉండే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో అత‌ని బాడీని మార్చురీలో పెట్టారు.

అలా ఒక రాత్రంతా హిమాన్షు బాడీ మార్చురీలోనే ఉంది. తెల్ల‌వారుజామున వైద్యులు హిమాన్షు బాడీకి పోస్టు మార్టం చేసేందుకు వ‌చ్చారు. అయితే అప్ప‌టికే హిమాన్షు బ‌తికి ఉన్న‌ట్టు వారు గుర్తించారు. మార్చురీని క్లీన్ చేసేందుకు వ‌చ్చిన ఓ స్వీప‌ర్ చేయిని హిమాన్షు ప‌ట్టుకున్నాడు. దీంతో అత‌ను భ‌య‌ప‌డి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. త‌రువాత వ‌చ్చిన వైద్యులు పోస్టుమార్టం చేయ‌బోయి షాక్ తిన్నారు. హిమాన్షు బ‌తికే ఉన్నాడ‌ని గుర్తించి అత‌నికి ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు. త‌రువాత అత‌ని పేరెంట్స్ వ‌చ్చి హిమాన్షును మ‌ళ్లీ నాగ్‌పూర్‌లో మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే నిజానికి హిమాన్షుకు యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలు అయినా అత‌ను బ‌తికే ఉన్నాడ‌ట‌.

కానీ అత‌ను చ‌నిపోయాడ‌ని నాగ్‌పూర్‌లో ఆ హాస్పిట‌ల్ వైద్యులు చెప్పారు. తీరా చివ‌ర‌కు పోస్టు మార్టం చేసే ముందు అత‌ను బతికే ఉన్నాడ‌ని తెలిసింది. దీంతో హిమాన్షు బంధువులు, స్నేహితులు నాగ్‌పూర్‌లో ఆ హాస్పిట‌ల్ ముందు ధ‌ర్నా చేశారు. వ్య‌క్తి బ‌తికే ఉన్నా నిర్ల‌క్ష్యం వ‌హించి అత‌ను చ‌నిపోయాడ‌ని డాక్ట‌ర్లు చెప్పార‌ని, ఇందుకు వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు. ఏది ఏమైనా.. కొంచెం ఆల‌స్యం అయి ఉంటే ఓ నిండు ప్రాణం బ‌ల‌య్యేది. కానీ చివ‌రి క్ష‌ణంలో ఎలాగో తెలిసింది. దీంతో ఆ యువ‌కుడు బ‌తికిపోయాడు. ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో సేఫ్‌గా ఉన్నాడు. అత‌ను చ‌నిపోయాడ‌ని చెప్పి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించిన ఆ డాక్ట‌ర్ల‌ను ఏం చేయాలి ? వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top