చనిపోవడానికి ముందు సంధ్యారాణి మాట్లాడిన చివరి మాటలు ఇవే…అంబులెన్సు లో తీసుకెళ్తుండగా..!

ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించడంతో గాయపడిన సంధ్యారాణి చనిపోయింది.ప్రేమించకపోతే యాసిడ్ దాడులు,గ్యాంగ్ రేపులు,కత్తితో పొడవడం..ఇలా ఏదో ఒక విధంగా దాడులు చేయడం… అమ్మాయిలు నిత్యం భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి.. ప్రేమించలేదనే ఏకైక కారణంతో కార్తిక్ అనే యువకుడు సంధ్యని చంపేశాడు.సంధ్య ఎవరూ,కార్తిక్ తో ఎలా పరిచయం…చంపేసేంత తప్పు సంధ్య ఏం చేసింది..అంత  పగ ఎందుకు పెంచుకున్నాడు.. వివరాలు..

నేరెడు సంధ్యారాణి తల్లి సావిత్రి, , అక్కతో లాలాగూడలోని భజన సమాజంలో నివాసముంటోంది. శాంతినగర్‌లోని ఓ అల్యూమినియం దుకాణంలో పనిచేస్తోంది.సంధ్య జీతంతోనే కుటుంబం నడుస్తోంది.ఒకే దగ్గర పనిచేస్తుండడంతో రెండేళ్ల నుంచి కార్తీక్‌తో సంధ్యారాణికి పరిచయం ఉంది.కానీ  కొంతకాలంగా కార్తీక్ ఉద్యోగం మానేసి,జులాయిగా తిరగడం స్టార్ట్ చేశాడు..చెడుతిరుగుళ్లకు అలవాటుపడ్డ కార్తీక్ ను దూరం పెట్టింది సంధ్య. ప్రేమ, పెళ్లి అంటూ సంధ్యారాణిని కార్తీక్ వెంట పడుతుండడంతో..తనమీదే ఆధారపడి ఉన్న కుటుంబాన్ని కాదనుకుని ఇలాంటివాడితో ప్రేమ ఎలా అనే కారణంతో సంధ్య నిరాకరించింది..దాంతో తనపై కోపం పెంచుకుని..

షాప్ లో  పని పూర్తయ్యాక గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న సంధ్యారాణితో కార్తీక్  రోడ్ మీదే  గొడవకు దిగాడు. ఆ తర్వాత ముందె తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై పోశాడు..దాంతో ఆమె జనాలు ఉన్నవైపుగా పరుగందుకుంది..తను పరుగెత్తినవైపే బైక్ పై వెళ్లి నిప్పంటించి పరారయ్యాడు..మంటలకు తట్టుకోలేక కుప్పకూలిపోయిన సంధ్యపై రోడ్ మీద వెళ్తున్న వారు పాత దుస్తులనుకప్పి మంటలార్పారు.  సంధ్య తల్లి  ,అక్కా వెంటనే అక్కడికి చేరుకుని గాంధి హాస్పటల్ కి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది..

చనిపోవడానికి ముందు సంధ్య మాట్లాడిన చివరి మాటలు..

గాంధీలో చికిత్స పొందుతున్న సమయంలో సంధ్య… తనను ప్రేమించాలంటూ కార్తీక్‌ ఏడాదిగా వేధిస్తున్నాడని.. అందుకు నిరాకరించినందుకే తనపై పెట్రోలు పోసి నిప్పంటించాడని పోలిసుల మరణ వాంగ్మూలంలో ఆమె చెప్పింది..అంబులెన్స్లో వచ్చేప్పుడు కూడా అంబువలెన్స్ సిబ్బంది ఆమె మాటల్ని వీడియో తీయడానికి  ప్రయత్నించారు.అప్పుడు తనపై దాడి చేసింది కార్తికే ,తన ప్రేమని కాదన్నందుకే ఇలా చేశాడని చెప్పింది..

Comments

comments

Share this post

scroll to top