చ‌నిపోతున్నా మ‌ళ్లీ బ్ర‌తికి వ‌స్తా.. నా శ‌రీరాన్ని ఖ‌న‌నం చేయ‌కండి.

జేఎస్.. బ్రిట‌న్ లోని ఓ ప్రాంతంలో త‌ల్లితో పాటు ఉంటోంది. స‌డ‌న్ గా ఓ రోజు రాత్రి క‌లవ‌చ్చింది. అంతే ఉలిక్కి ప‌డి లేచింది. ఓ భ‌యంక‌ర‌మైన వ్యాధితో తాను చ‌నిపోబోతున్న‌ట్టు క‌ల‌రావ‌డం.. మ‌రి కొన్ని రోజుల్లో చ‌నిపోబోతున్న‌ట్టు తెలియ‌డంతో చాలా భ‌య‌ప‌డింది. మ‌రుస‌టి రోజు నిజం తెలుసుకునేందుకు వైద్యుల‌ను సంప్ర‌దించింది. అనుకున్న‌ట్టుగానే తాను భ‌య‌క‌రమైన వ్యాధి తో బాధ‌ప‌డుతున్న‌ట్టు.. మ‌రో నెల రోజుల కంటే ఎక్కువ బ్ర‌తికే అవ‌కాశాలు లేవంటు తెలిపారు డాక్ట‌ర్లు. ఈ విష‌యం త‌న త‌ల్లికి తెలియ‌డంతో అలా జ‌ర‌గ‌డానికి వీళ్లేదు.. ఎంత డ‌బ్బైనా ప‌ర్వాలేదు నిన్ను కాపాడుకుంటానంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. కానీ చావును ఎవ‌రు ఆప‌లేర‌న్న నిజాన్ని మాత్రం ఆ త‌ల్లి గుర్తించ లేదు.

జేఎస్ మాత్రం చ‌నిపోవ‌డానికి సిద్దంగా లేదు. బ్ర‌త‌కాలి.. చ‌నిపోయినా మ‌ళ్లీ తిరిగి బ్ర‌త‌కాలి.. అలాంటి అవ‌కాశం ఏదైనా ఉందా అనే ఆలోచ‌న‌తో గూగుల్ లో రాత్రంతా వెతికింది. చివ‌రికి అత్యంత శీతలీకరణ పద్ధతిలో మృతదేహాలను భద్రపరిచే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. కానీ అక్క‌డి చ‌ట్టాలు అందుకు ఒప్పుకునే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో.. కోర్టుకు ఇలా అభ్య‌ర్థ‌న పెట్టుకుంది.. ‘‘నా వయస్సు 14 ఏళ్లు మాత్రమే. నాకు చనిపోవాలని లేదు. కానీ చనిపోతానని తెలుసు. అత్యంత శీతలీకరణ పద్ధతిలో నా శరీరాన్ని భద్రపరిస్తే వందేళ్ల తర్వాత అయినా చికిత్స లభించి మళ్లీ బతికే అవకాశం ఉంటుందేమో. నా శరీరాన్ని ఖననం చేయడం నాకు ఇష్టం లేదు. నాకు చాలా కాలం బతకాలని ఉంది. నా క్యాన్సర్‌ వ్యాధికి భవిష్యత్తులో చికిత్సను కనుక్కోవచ్చు. నన్ను బతికించవచ్చు. ఈ అవకాశం నాకు కావాలి. ఇది నా కోరిక.’’ అని న్యాయమూర్తికి మొర‌పెట్టుకుంది.

js87155672-justice-jackson-xlarge

కానీ అక్క‌డి చ‌ట్టాల ప్ర‌కారం త‌ల్లిదండ్రుల అనుమ‌తి ఉంటేనే ఇలాంటి కేసుల్లో తీర్పు సాధ్యం. ఇక జేఎస్ త‌ల్లిదండ్రులు మాత్రం త‌న చిన్న త‌నంలోనే విడిపోయారు. సో తీర్పు అనుకూలంగా రావ‌డం క‌ష్ట‌మే కానీ.. ఆ చిన్నారి ధైర్యం ప‌ట్టుద‌ల ముందు కోర్టు కూడా త‌న వైపు నిల‌వ‌క త‌ప్ప‌లేదు. చివ‌రికి జేఎస్ కు అనుకూలంగా తీర్పునిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు జస్టిస్‌ పీటర్‌. జేఎస్ మ‌ర‌ణించాక త‌న శ‌రీరాన్ని ఖ‌ననం చేయ‌వ‌ద్ద‌ని కోర్టును తీర్పునిచ్చింది. తీర్పు వెలువ‌డిన కొన్ని రోజుల‌కే జేఎస్ తుది శ్వాస విడిచింది.
ఈ కేసు తొలుత సెప్టెంబరు 26న కోర్టు దృష్టికి వచ్చింది. అక్టోబ‌ర్ 6న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెలువరించారు. అదే నెల 17న జేఎస్‌ తుది శ్వాస విడిచింది.js113947397__cryonics-uk-large_transedjtm7jpzhsgr1_8apewqa1vlvhkmtvb21dmmpqbfes

అత్యంత శీతలీకరణ పద్ధతిలో మృతదేహాలను భద్రపర్చడం చాలా వ్యయంతో కూడుకున్న పని. అమెరికాలో ఉన్న క్రయోనిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ అనే కంపెనీని ఈ పని కోసం జేఎస్‌ ఎంచుకుంది. ఈ ప్రక్రియకు 37వేల పౌండ్ల ఖర్చు అవుతుంది. జేఎస్‌ తల్లిదండ్రులకు అంత తాహతు లేదు. అయితే జేఎస్‌ అమ్మమ్మ, తాతయ్యలు ఆ మొత్తాన్ని సేకరించగలిగారు. జేఎస్‌ మరణించిన వారం రోజుల తర్వాత ఆమె భౌతికకాయాన్ని అమెరికాకు తరలించి అక్కడ భద్రపర్చారు. 1960ల్లో ఈ ప్రక్రియను కనుక్కొన్న తర్వాత ఇప్పటి వరకు దాదాపు 350 మంది భౌతికకాయాలను భద్రపర్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సేవలను అందించే సంస్థలు మూడే ఉన్నాయి.

Comments

comments

Share this post

scroll to top