ఆ చిన్నారి బోరు బావిలో అసలు ఎలా పడ్డాడో తెలుసా..? 11 గంటల తర్వాత బయటకి ఎలా తీశారో వీడియో చూడండి!

బోరుబావిలోంచి చిన్నారి బతికొస్తుందనుకున్న ఎంతోమంది కన్నతల్లులకి కన్నీళ్లే మిగిలాయి. కన్నతల్లి పేగు బంధాన్ని శాశ్వతంగా తెంచుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన బిడ్డలు ఎందరో.. అమ్మా అని నోరారా పిలిచే చిట్టిపొట్టి మాటలు దూరమైన ఘటనలు ఎన్నో.. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లులకి బోరుబావి ఘటనలు  మిగిల్చినవి కడుపుకోతే.పోయిన నెల చేవెళ్లలో బోరుబావిలో పడిన మీన కూడా మనకు దక్కకుండా పోయింది..నెలతిరక్కుండానే మరొక ఘటన..వినుకొండలో..కానీ ఈ సారి చిన్నారి మృత్యుంజయుడు గా తిరిగొచ్చాడు..

ఉమ్మడివరానికి చెందిన అనుమర్లమూరి మల్లికార్జున్, అనూషలకు చందు ఒక్కగానొక్క కొడుకు..తల్లితో ఆడుకుంటూ పశువుల పాక వద్దకు వెళ్లాడు.ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సమీపంలోని బోరుబావిలో పడ్డాడు. ..వెళ్లిన బాబు కాసేపటికి కనపడకపోయేసరికి చుట్టుపక్కల అంతా వెతికింది అనూష..కొడుకు కోసం చాలాసేపు వెతికిన అనూష చివరకు సమీపంలోని బోరుబావిలో పడ్డట్లు గుర్తించింది.ఇంతలో జనం గుమిగూడడం,స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది అక్కడికి చేరడం.. చురుకుగా పనులు ప్రారంభించడం చకచకా జరిగాయి.సుమారు 13 అడుగుల లోతులో పడ్డ బాలుడిని 11 గంటలకు పైగా శ్రమించి బోరు బావికి సమాంతరంగా 25 అడుగుల మేరకు గుంత తవ్వారు. బాలుడి కదలికలను గుర్తించామని, అతడు పిలిస్తే పలుకుతున్నాడని ఆక్సిజన్ అందిస్తున్నామని ఓవైపు అధికారులు తెలపగా.. మరోవైపు రెస్క్యూ సిబ్బంది (ఎన్డీఆర్ఎఫ్) సమాంతరంగా తవ్విన గుంత నుంచి బాలుడిని బావి నుంచి పైకి తీయగానే ఘటనా స్థలంలో బాలుడి తల్లితండ్రులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతుండగా మధ్యలో రాళ్లు ఎదురైనా, వర్షం కురిసినా ఎన్డీఆర్ఎఫ్ బృందం 11 గంటలకు పైగా తీవ్రంగా శ్రమించి చిన్నారి చంద్రశేఖర్‌ను ప్రాణాలతో కాపాడటం నిజంగా గర్వకారణం.

watch video here:

ప్రాణాలతో బయటికి వచ్చిన కొడుకుని చూసుకుని ఆ తల్లిదండ్రుల సంతోషం వర్ణనాతీతం..తొమ్మిది నెలలు మోసి కన్న పేగుబంధం ఎక్కడ దూరం అవుతుందో అని ఆ తల్లి పడిన నరకం..మరే తల్లికి రాకూడదు.ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఇంకా బోరుబావుల విషయంలో నిర్లక్ష్యం తగదు.

Comments

comments

Share this post

scroll to top