చంద్రమోహన్ కూతురికి ఫిదా అయిన “ఇవాంకా”…అదెలా సాధ్యం అనుకుంటున్నారా.? అసలేమైందంటే?

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు,సలహదారు ఇవాంకా ట్రంప్‌కు హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ  విందు ఇచ్చారు.చారిత్రాత్మకమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో హోటల్లో విశాలమైన డైనింగ్ హాలులో ఈ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.విందు అనంతరం సాంస్కృ తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో తన ప్రదర్శనతో ఇవాంక చేత ఒన్స్ మోర్ అనిపించుకున్నారు చంద్రమోహన్ కూతురు.

జిఇఎస్ లో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులకు మొదటి రోజు సమావేశం అనంతరం ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విందు అనంతరం మంగళంపల్లి బాలమురళీకృష్ణ థిల్లానాను ,మన దేశ సంస్కృతి ఉట్టి పడేలా నృత్యరూపకాలను ప్రదర్శించారు..అందులో భాగంగా చంద్రమోహన్ కూతురు మాధవి ఇక్కడ కూచిపూడి నృత్యంతో ఆహోతులను అలరించారు.భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తూ కూచిపూడితో పాటు భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, మణిపురి వంటి సంప్రదాయ నాట్యాలు అన్నింటిని కలిపిచేసిన నృత్యాన్ని గంటపాటు ప్రదర్శించారు.మాదవి తో పాటు మరికొందరు ప్రదర్శించిన ఈ నృత్యం అందరినీ కట్టిపడేసి వేదిక చప్పట్లతో మార్మోగిపోయింది.ఆ నృత్య ప్రదర్శన చూసిన  ఇవాంకా ట్రంప్  ఒక్కసారిగా వన్స్‌మోర్ అన్నారట. ఆ ప్రదర్శన కింద వీడియోలో మీరు చూసేయండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top