చోరి చేశాడని, కాళ్లూ,చేతులు కట్టేసి, తలకిందులుగా వేలాడదీసి, రాడ్స్ తో కొట్టి చంపేశారు!

దొంగతనం చేశాడన్న ఆరోపణతో ఓ వ్యక్తిని ఫ్యాక్టరీ యజమాని కాళ్లూ,చేతులు కట్టేసి, తలకిందులుగా వేలాడదీసి, రాడ్స్ తో కొట్టి చంపిన ఘటన పంజాబ్ లో జరిగింది. అమృతసర్‌లో జస్ ప్రీత్ సింగ్‌కు  చెందిన ఓ ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన రామ్ సింగ్ పనిచేస్తున్నాడు. తన ఫ్యాక్టరీలో రామ్ సింగ్ దొంగతనం చేశాడన్న అనుమానంతో ఓ రోజు అతడిని ఫ్యాక్టరీకి పిల్పించాడు జస్ ప్రీత్.  రామ్ సింగ్ వచ్చీ రావడంతోనే అతనిని పట్టుకొని  కాళ్లూచేతులూ కట్టేసి పైన కడ్డీకి వేలాడదీశారు. అనంతరం అతనిని రాడ్లతో అదేపనిగా కొట్టారు. ఆ దెబ్బలకు అతడు మృతి చెందాడు. ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు షాపు ఓనర్ ను అతనికి సహకరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top