కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు జోధ్పూర్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.సుమారు ఇరవై ఏళ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో సల్మాన్ ను దోషిగా తేలుస్తూ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది..అయితే ఈ కేసులో సల్మాన్ తప్ప మిగతావారందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది..ఈ ఘటనకి సంభందించి ఒక ముఖ్యమైన విషయం బయటికి వచ్చింది..అదేంటంటే..
అది 1998లో రాజస్థాన్లోని జోద్ పూర్ కి హమ్ సాథ్ సాథ్ హై అనే షూటింగ్లో పాల్గొనడానికి వెళ్లాడు సల్మాన్..ఆ సినిమాలో సల్మాన్ తో పాటు సైఫ్ ఆలికాన్,సోనాలి బింద్రే,టబూ,నీలమ్ ,మోనిష్,కరిష్మా కూడా నటించారు.సూరజ్ బర్జాత్య దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా.ఆ షూటింగ్ టైంలోనే కంకణి అనే గ్రామంలో తిరుగుతున్న రెండు కృష్ణ జింకలపై సల్మాన్ కాల్పులు జరిపినట్టు స్థానికులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సల్మాన్ తో పాటు సైప్,నీలమ్ ,టబు ఉన్నట్టు ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు..బిష్ణోయ్ వర్గం చేసిన కంప్లైంట్ పై ఇరవైఏళ్లపాటు విచారణ కొనసాగింది..ఇన్నేళ్ల తర్వాత సల్మాన్ దోషి అంటూ జోద్ పూర్ కోర్ట్ ప్రకటించింది..ఐదేళ్ల జైలు శిక్ష విధించింది…తీర్పు విన్నవెంటనే ఒక్కసారిగా సల్మాన్ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన పక్కనే ఉన్న ఇద్దరు చెల్లెళ్లు అర్పిత, అల్విరా ఖాన్లు కన్నీరుమున్నీరయ్యారు
అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సల్మాన్ కృష్ణ జింకలను వేటాడుతున్న సమయంలో జీపులో పక్కనే కూర్చొని ఉన్న హీరోయిన్ టబు అతడిని కాల్చమని రెచ్చగొట్టారట. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఒకరు న్యాయస్థానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఇన్నేళ్లల్లో ఎప్పుడూ కూడా సల్మాన్ పేరు తప్ప మరొకరి పేరు బైటికి రాలేదు..ఇప్పుడు టబు పేరు బైటికి రావడంతో అందరి దృష్టి టబు వైపు మళ్లింది..దీనిపై టబు ఇంతవరకు స్పందించలేదు..