నాగ శౌర్య, రష్మిక జంటగా నటించిన “ఛలో” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): ఛలో (chalo)

Cast & Crew:

  • నటీనటులు: నాగశౌర్య, రష్మిక మండన్నా, నరేష్, సత్య తదితరులు
  • సంగీతం: మహతి స్వర సాగర్
  • నిర్మాత:  ఉష మూల్పూరి
  • దర్శకత్వం: వెంకీ కుడుముల

Story:

హరి(నాగశౌర్య)కి చిన్నప్పటి నుండి గొడవలంటే చాలా ఇష్టం. తనకు సంబంధం ఉన్నా.. లేకున్నా.. ప్రతి గొడవలో తలదూరుస్తుంటాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన తల్లితండ్రులు అతడిని హైదరాబాద్‌కు దూరంగా ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతం ‘తిరుప్పురం’కు పంపించేస్తారు. అప్పటికే అక్కడ తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయి ఓ కంచె నిర్మించుకొని మరీ గొడవ పడుతుంటారు. ఆ ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే తెలుగు వాడైన హరిని చంపాలనుకుంటారు తమిళులు. ఎలాగోలా వారి నుండి తప్పించుకుంటాడు. అసలు తెలుగు వాడు హద్దు దాటి వారి పరిధిలోకి వెళ్తేనే తట్టుకోలేని తమిళ వర్గపు నాయకుడు కూతురు కార్తీక(రష్మిక)ను ప్రేమిస్తాడు హరి. కార్తీక కూడా అతడిని ప్రేమించినప్పటికీ ఊరు ఒక్కటిగా కలిస్తేనే తప్ప మన ప్రేమ గెలవదని మెలిక పెడుతుంది. మరి తన ప్రేమ కోసం హరి ఊరిని ఒక్కటిగా చేశాడా..? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు..? అనేదే మిగిలిన కథ.

Review:

1953లో ప్రాంతీయ కారణాల వలన అప్పటివరకూ అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉన్న తెలుగు, తమిళ భాషల వారు ఒక్కసారిగా విడిపోతారు. రెండు వర్గాల వారు ఊరు మధ్యలో కంచె ఏర్పాటు చేసుకొని హద్దులు విధించుకుంటారు. అటువంటి ప్రాంతానికి చదువుకోవడం కోసం వచ్చిన ఒక తెలుగువాడు తమిళమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమను దక్కించుకోవడం కోసం ఆ యువకుడు పడిన పాట్లే ఈ సినిమా. దర్శకుడు వెంకీ కుడుముల నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నాడు. కాలేజ్‌లో హీరో ఎంటర్ అయిన దగ్గర నుండి ప్రతి సన్నివేశంలో కామెడీ ఉంటుంది. పోసాని ఎపిసోడ్ ఆడియన్స్‌ను మరింత నవ్విస్తుంది. ఉన్న మూడు నిమిషాల్లో కడుపుబ్బా నవ్వించేశాడు పోసాని. ఇంటెర్వెల్ ఎపిసోడ్ తరువాత ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ కలిగిస్తుంది. అప్పటివరకూ సరదాగా సాగిపోయిన సినిమా కాస్త సెకండ్ హాఫ్‌లో కాస్త స్లోగా నడుస్తుందనిపిస్తుంది.

నాగ శౌర్య సినిమాలో ఓ పక్క మాస్ అవతారంలో కనిపిస్తూనే మరోపక్క క్లాస్ టచ్ ఇచ్చాడు. రష్మిక ప్రతి ఎమోషన్‌ను బాగా ఎక్స్ ప్రెస్ చేసింది. నరేష్, అచ్యుత్ కుమార్, రాజేంద్రన్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలతో మెప్పించారు. సత్య, వైవా హర్షల కామెడీ బాగా పండింది. రఘుబాబు ప్రిన్సిపల్ పాత్రలో సూట్ అవ్వలేదు. అయినప్పటికీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మహతి స్వర సాగర్ అందించిన నేపధ్య సంగీతం, పాటలు బాగున్నాయి. పాటలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాల్లో ఒకటి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలుభారీగా ఉన్నాయి.

Plus Points:

హీరో హీరోయిన్ పెర్ఫార్మన్స్
కామెడీ
లవ్ ట్రాక్
సాంగ్స్
మ్యూజిక్

Minus Points:

సాగదీసిన సన్నివేశాలు
సీరియస్ గా ఉండాల్సిన సీన్స్ కూడా కామెడీ తరహాలో చిత్రీకరించారు.

Final Verdict:

నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉండే ఈ సినిమా కుటుంబసమేతంగా చూసి ఎంజాయ్ చేయవచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

AP2TG Rating: 3 / 5

Trailer:

 

Comments

comments

Share this post

scroll to top