సీనియర్ నటుడు అన్నాక కొద్దోగొప్పో సంస్కారం ఉండాలి. ఏం మాట్లాడుతున్నాము అని ఒకసారి ఆలోచించాలి. నోటికి ఎంతొస్తే అంత అనేయడమేనా? మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న “చలపతి రావు” చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు మండిపడుతున్నారు. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న “రారండోయ్ వేడుక చూద్దాం” అనే సినిమా ఆడియో ఫంక్షన్ ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా “చలపతి రావు” అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం నెట్ లో కలకలం రేపింది.పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన చలపతిరావులాంటి పరిశ్రమ పెద్దలు అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడడం తగదని కమెంట్ చేస్తున్నారు.
సినిమాలోని ట్రైలర్ లో నాగచైతన్య అమ్మాయిలు హానికరం అని ఒక డైలాగ్ అంటదు. ఆ డైలాగ్ ఆధారంగా తీసుకుని యాంకర్ “చలపతి రావు” గారిని “అమ్మాయిల మనశ్శాంతికి హానికరమా?” అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా “చలపతి రావు” “అమ్మాయిలు హానికరమో లేదో తెలీదు..కానీ పక్కలోకి మాత్రం పనికొస్తారు” అని నీచంగా మాట్లాడారు. యాంకర్ అయితే ఈ మాటలను సెన్సార్ కట్ చేయాలి అనేసారు.