చక్రి మెచ్చిన పాటలు ఏవి? చక్రికి పూరీకి ఉన్న బంధం ఎటువంటిది?

చక్రి సంగీత ప్రపంచంలో ఓ నిశ్శబ్ద విప్లవం.  పెళ్లిల్లలో పాట పాడే స్థాయి నుండి ఫిల్మ్ ఫేర్ అవార్డు దాకా అతనిది అత్బుత ప్రస్థానం. అకాల మరణంతో మన నుండి దూరమయినా పాటల రూపంలో మన మధ్యే తిరుగుతుంటాడు, మన నాలుక మీదే ఆటాడుతుంటాడు.చక్రి ఇదే రోజు (జూన్ 15)  పుట్టాడు. తండ్రి టీచర్. వరంగల్ జిల్లా కంబాలపల్లిలో జననం. చిన్నప్పటి నుండి సంగీతం మీద ఇంట్రస్ట్ ఉండే చక్రి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి చాలా కష్టపడ్డాడు.

music-director-chakri-latest-stills (8)

సంగీత దర్శకుడు కావాలనుకున్న చక్రి హైద్రాబాద్ వచ్చి మూడేళ్లల్లో 30 మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు.హీరో చిరంజీవి పై ప్రత్యేక ఆల్బమ్ ను చిరునవ్వు పేరుతో విడుదల చేసి సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. బాచీ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించాడు.సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.సింహా సినిమాకు  నంది అవార్డు అందుకున్నారు. మొత్తం 85 చిత్రాలకు  సంగీత దర్శకత్వం వహించాడు.

పూరీ చక్రి బంధం:

బాచి సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూరి జగన్నాథ్ మినహా ఆ సినిమా ప్రభావం ఆ చిత్ర సాంకేతిక నిపుణులందరిపై పడింది. దాంతో పూరీ తదుపరి చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంకి సంగీత దర్శకుడిగా చక్రిని తీసుకోవద్దని నిర్మాత పట్టుబట్టారు. దాంతో పూరీ… నిర్మాతను వదిలాడు కానీ… చక్రిని వదల్లేదు. అదే కథతో మరో నిర్మాతకు సినిమా చేసిపెట్టాడు. అందుకే… చివరి శ్వాస విడిచే వరకూ పూరి జగన్నాథ్‌ని దైవంగా భావించారు చక్రి. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే.

chakri and puri best friends

ఈ రోజు చక్రి పుట్టిన రోజు అందుకే చక్రి ఆల్ టైమ్ మ్యూజికల్ హిట్స్ తో అతనికి బర్త్ డే విషెస్.

1) నువ్వకడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల(గోపి గోపిక గోదావరి)

2) వెన్నెల్లో హాయ్ హాయ్ (ఔన్ వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు)

3) ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా( సత్యం).

4) మళ్లి కూయవే గువ్వా(ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం)

5) నిన్నే నిన్నే నిన్నే నిన్నే, దిల్ సే దిల్ సే (దేశ ముదురు)

6) కృష్ణా నగరే మామ(నేనింతే)

7) గుండెల్ని పిండేది తెలుసా( దేవదాసు)

8) గుండె గోదారిలా చిందులేస్తోందిలా ( మస్కా)

9) నీవె నీవె నీవంట(అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి)

10) గుండెల్లో ఏదో సడి( గోలిమార్)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top