“చక్రవాకం” సీరియల్ లో నటించిన ఈ 7 మంది గుర్తున్నారా.? ఇప్పుడెలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలుసా..?

చక్రవాకం… తెలుగు సీరియల్స్ చరిత్రలో ఒక సంచలనం..సీరియల్స్ అంటేనే అవి ఆడవాళ్లు మాత్రమే చూసేవి అనే ఒక ముద్రని చెరిపేసిన సీరియల్ అమృతం అయితే ఆ తర్వాత చక్రవాకం అదే రేంజ్ లో పేరు తెచ్చుకుంది.ప్రేమకథతో అటు యువతని ఇటు పెద్దవారిని ఆకట్టుకున్న చక్రవాకం సీరియల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఈ సీరియల్ డైరెక్టర్స్ మంజులా నాయుడు,బిందునాయుడు..వీరిద్దరూ ఈ కథను రాసుకున్న విధానం,తీసిన తీరే ప్రేక్షకులకు దీన్ని చేరువ చేసింది..ఇక ఇందులో నటించిన నటులు ఈ సీరియల్ తర్వాత ఏ రేంజ్ కి వెళ్లారో చెప్పక్కర్లేదు..వారి గురించి కొన్ని విషయాలు మీకోసం..

watch video here:

ఇంద్రనీల్ చక్రవాకం సీరియల్లో ఇంద్ర గా నటించిన నటుడు అసలు పేరు రాజేశ్ బాబు..విజయవాడకు చెందిన రాజేశ్ ఈ సీరియల్ తర్వాత వచ్చిన క్రేజ్ తో ఇంద్రనీల్ గా మారిపోయాడు..అంతేకాదు ఈ సీరియల్లో తనకు అత్తపాత్రలో నటించిన మేఘనరామిని ప్రేమించి ,తనను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.ఈ జంట ఇప్పుడ నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా వస్తున్నారు.ఈ సీరియల్ తర్వాత ఇంద్ర మొగలిరేకులు కూడా లీడ్ రోల్ పోషించాడు.ఆ తర్వతా కొన్ని సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు..

ప్రీతి అమీన్ స్రవంతి,ఇంద్ర ల పేర్లు ప్రేమ ఉన్నంత కాలం గుర్తుంటాయనడంలో అతిశయోక్తిలేదు.అంతలా అందరిని అలరించింది వీరి ప్రేమకథ.ఈ సినిమాలో స్రవంతిగా నటించిన ప్రీతి అమీన్ కొన్ని హిందీ ప్రోగ్రామ్స్ కూడ ాచేసేది.. ఈ సీరియల్ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది స్రవంతి అలియాస్ ప్రీతి అమీన్.

సెల్వరాజ్ ఇంద్ర,స్రవంతిల ప్రేమ లానే,ఇక్బాల్ ,స్రవంతి ల స్నేహం కూడా ఈ సీరియల్లో అందరిని ఆకట్టుకున్న అంశం.ఈ సీరియల్తో ఇక్బాల్ గా పరిచయం అయిన సెల్వ..తర్వాత మొగలిరేకులు లో సెల్వ గా మరింత పేరు తెచ్చుకుని ఇప్పుడు సినిమా అవకాశాలు చాలానేతెచ్చుకున్నాడు.ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాడు.

శృతి సీరియల్స్ గురించి తెలిసినవారికి శృతి గురించి పరిచయం అక్కర్లేదు.. రుతురాగాలు, మొగలిరేకులు, ,చక్రవాకం శృతి చేసిన సీరియల్స్ లో కొన్ని ఈమె మంజులానాయుడు మొదట దూరదర్శన్ లో చేసిన కాల చక్రం సీరియల్లో కూడా చేసింది.ఈమె భర్త మధుసూదన్,తల్లి నాగమణి కూడా నటులే..ఇప్పుడు మరికొన్ని సీరియల్స్ చేస్తున్నారు శృతి.

మేధ మీ శ్రేయోభిలాషి సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురుగా కనపడిన మేధ..మొదటి పరిచయం చక్రవాకం తోనే..ఈ సీరియల్ తర్వాత మొఘలిరేకులు లో కీర్తన గా కూడా అందరి ఆధారభిమానాలు పొందింది.పెళ్లి చేసుకుని సీరియల్స్ కి దూరమైన మేధకి ఇప్పుడు ఒక బాబు..

సాగర్ చక్రవాకంలో సాగర్ కనపడినా సాగర్..ఆ తర్వాత మొగలిరేకకులులో ఆర్కె గా,మున్నాగా ఎంత క్రేజ్ సంపాదించారో అందరికి తెలిసిందే..సీరియల్స్ తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు సాగర్. మిస్టర్ ఫర్పెక్ట్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సాగర్ తర్వాత రెండు సినిమాల్లో నటించారు.ఇప్పుడు పెళ్లిచేసుకుని కొంచెం గ్యాప్ తీసుకున్నట్టున్నారు.

పావని చక్రవాకం సీరియల్ కి ముందుగానే పావని సీరియల్ ఆర్టిస్ట్ గా గుర్తింపుపొందింది.కానీ ఈ సీరియల్ తర్వాత అవకాశాలు కూడా ఎక్కువే వచ్చాయి.స్టూడెంట్ నం.1 సినిమాలో కనిపించింది పావని.ఆ తర్వాత కొన్ిన సినిమాలు సీరియల్స్ చేసి,పెళ్లిచేసుకుని కుటుంబాన్ని చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా గడిపేస్తుంది.

లహరి ఈ సీరియల్ తర్వాత ఎక్కువ బెనిఫిట్ పొందిన  ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారా అంటే అది లహరి మాత్రమే అని కుండబద్దలు  కొట్టినట్టు చెప్పొచ్చు.. ఈ సీరియల్ తర్వాత వరుసబెట్టి ఆఫర్లు రావడమే కాదు వాటన్నింటిని సద్వినియోగం చేసుకుంది లహరి,ఇప్పటికి చేసుకుంటుంది కూడా…మొగలిరేకులు,ఆరాదన,ముద్దుబిడ్డ,లయ సీరియల్స్లో నటించడమే కాదు,సినిమాల్లో కూడా నటించింది.ఇప్పుడు పక్కింటమ్మాయి సీరియల్లో నటిస్తుంది.

 

Comments

comments

Share this post

scroll to top