స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే మీ చేతి వేళ్ళు జాగ్రత్త!

స్మార్ట్ ఫోన్ వాడకం అనేది అవసరం నుండి వ్యసనంగా మారింది, ఈ కాలం లో చిన్న పిల్లోల్ల నుండి పండు పండు ముసలి వాళ్ళ వరకు దాదాపు అందరు స్మార్ట్ ఫోన్ల లే వాడుతున్నారు, స్మార్ట్ ఫోన్ లు మన జీవితాన్ని ఎంతలా మార్చేశాయి అంటే, దూరం గ ఉండే అమ్మ నాన్న తో ఫోన్ లోనో లేదా వీడియో కాల్ లోనో మాట్లాడేది పోయి, హే మామ్ డాడ్ హాయ్ అంటూ వాట్స్ అప్ లో మెసేజ్ లు , యాక్సిడెంట్ అయితే ఫీలింగ్ సాడ్ అంటూ సెల్ఫీ లు దిగి ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ యాప్స్ లో పెట్టడం ఫాషన్ అయిపోయింది..

చైనా లో కలకలం రేపిన ఒక యువతి సంఘటన :

మరీ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ కి బానిస అయితే చేతి వేలు బిగుసుకుపోడం ఖాయమని డాక్టర్ లు చెబుతున్నారు. ముఖ్యంగా యువత ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకోబోయే వరకు అంతా స్మార్ట్‌గా గడిపేస్తున్నారు. చైనాకు చెందిన ఓ మహిళ స్మార్ట్ ఫోన్‌తో కష్టాలు కొని తెచ్చుకుంది. మొబైల్‌కు బానిసై చేతి వేళ్లు కదిలించలేని స్థితికి చేరింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ స్మార్ట్‌ఫోన్‌కు బాగా అలవాటయ్యింది. వారం రోజులు పాటూ ఏకధాటిగా మొబైల్ వినియోగించింది. రాత్రి సమయంలో మాత్రం కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇలా రోజూ ఫోన్ వాడటంతో.. రెండు చేతులు బాగా నొప్పి పెట్టాయి. తర్వాత ఆమె వేళ్లు వంగి.. బిగుసుకుపోయాయి. కొన్ని వేళ్లు అయితే పూర్తిగా ఒంగిపోయాయి. దీంతో బాధితురాలు వైద్యుల్ని సంప్రదించింది. డాక్టర్లు ఆమె వేళ్లకు చికిత్స అందించారు. ఫిజియోథెరపీతో వేళ్లను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ అతిగా వాడటం వల్లే వేళ్లు ఇలా బిగుకుసుపోయాయంటున్నారు వైద్యులు. ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచిస్తున్నారు. లేకపోతే ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. ఆ మహిళ మరికొన్ని రోజులు మొబైల్ వాడి ఉంటే వేళ్లు పూర్తిగా బిగుసుకుపోయేవన్నారు.

WATCH VIDEO :

Comments

comments

Share this post

scroll to top