బ్లూ టిక్స్ రాకపోయినా…”వాట్సాప్” లో మన మెసేజ్ చదివారో లేదో తెలియాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.!

వాట్సాప్‌.. ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది యూజ‌ర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. ఎప్ప‌టిక‌ప్పుడు ఇందులో యూజర్ల‌కు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు ల‌భిస్తున్నాయి. అయితే ఇందులో ఆరంభం నుంచి యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్న ఫీచ‌ర్ ఒక‌టుంది. అదే బ్లూటిక్స్‌. మ‌నం పంపిన మెసేజ్‌ను అవ‌తలి వారు చ‌దివితే ఆ మెసేజ్ ప‌క్క‌న బ్లూ టిక్ క‌నిపిస్తుంది. దీంతో వారు ఆ మెసేజ్‌ను చ‌దివార‌ని మ‌నం అర్థం చేసుకుంటాం. అయితే ఈ బ్లూ టిక్ మెసేజ్‌ను కొంద‌రు ఆఫ్ చేస్తారు. వాట్సాప్‌లో ఉన్న సెట్టింగ్స్‌లోకి వెళ్లి రీడ్ రిసీప్ట్స్ ను ఆఫ్ చేస్తే చాలు, బ్లూ టిక్ పోతుంది. దీంతో మ‌న మెసేజ్‌ను అవ‌త‌లి వారు చ‌దివారో లేదో కూడా మ‌న‌కు తెలియ‌దు. అయితే వాట్సాప్‌లో ఉన్న బ్లూ టిక్ ఫీచ‌ర్ ను డిసేబుల్ చేసినా ఒక చిన్న ట్రిక్ స‌హాయంతో మన మెసేజ్‌ను అవ‌తలి వారు చ‌దివార‌ని సింపుల్‌గా తెలుసుకోవ‌చ్చు. ఆ సంద‌ర్భంలో మ‌న‌కు బ్లూ టిక్ క‌నిపిస్తుంది. మ‌రి ఆ ట్రిక్ ఎలా వాడాలో తెలుసా..?

వాట్సాప్‌లో ఎవ‌రైనా వ్య‌క్తి బ్లూ టిక్ ఆప్ష‌న్‌ను ఆఫ్ చేస్తే వారికి మీరు ఓ వాయిస్ మెసేజ్‌ను పంపండి. అవును, అదే. కేవ‌లం ఒక సెక‌న్ వ్య‌వ‌ధి ఉన్న మెసేజ్ అయినా స‌రే.. దాన్ని వాయిస్ మెసేజ్ రూపంలో సెండ్ చేయండి. దీంతో వారు దాన్నిఓపెన్ చేస్తే గ‌న‌క క‌చ్చితంగా దాని ప‌క్క‌న బ్లూ టిక్ క‌నిపిస్తుంది. దీంతో వారు మీ మెసేజ్‌ను చ‌దివార‌నే విష‌యం సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

అయితే ఈ వాయిస్ మెసేజ్‌ను మీరు ఏదైనా ఇత‌ర మెసేజ్ పంపాక సెండ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మొద‌ట మీరు వాయిస్ కాకుండా ఏదైనా ఇత‌ర మెసేజ్ (టెక్ట్స్‌, వీడియో, ఫొటో) పంపితే వారు దాన్ని చ‌దివారో లేదో తెలియ‌లేద‌నుకోండి, అప్పుడు వాయిస్ మెసేజ్‌ను పంపండి. దీంతో వారు దాన్ని ఓపెన్ చేస్తే గ‌న‌క దాని ప‌క్క‌న బ్లూ టిక్ క‌నిపిస్తుంది. దీంతో అంత‌కు ముందు మీరు పంపిన ఆ ఇత‌ర మెసేజ్‌ల‌ను కూడా చ‌దివిన‌ట్టు మీరు నిర్దారించుకోవ‌చ్చు. వాట్సాప్‌లో ఉన్న ట్రిక్‌ను ఇత‌రుల‌కు కూడా షేర్ చేసి తెలియ‌జేయండి.

Comments

comments

Share this post

scroll to top