చావుకే సవాల్ విసురుతున్న మెకానిక్. అతడి ఆత్మస్థైర్యానికి హ్యాట్సాఫ్.

చుట్టు దుమ్ము దూళి.. నిత్యం కాలుష్య కోర‌ల మ‌ధ్య ప‌ని. మోటారు మెకానిక్ గా పని చేసే ఎవ‌రికైనా ఇది స‌ర్వ సాదార‌ణం. కానీ ఈయ‌న‌కు మాత్రం ఆ పని చేయ‌డం ప్రాణాల‌తో చెల‌గాటం  లాంటిదే. అయినా ఆయ‌న వెన‌క‌డుగు వేయ‌ట్లేదు. ఊపిరిని సిలిండ‌ర్ లో నింపుకుని బ్రతుకుతూనే త‌న క‌ర్త‌వ్యాన్ని  నిర్వ‌హిస్తున్నాడు. త‌న‌తో పాటు మ‌రో న‌లుగురు కుర్రాళ్ల‌కు ప‌ని క‌ల్పించి అందులోనే సంతోషం వెతుక్కుంటున్నాడు. ఇంత‌కీ ఆ మెకానిక్ ఏమైంది. అంత ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన క‌థేంటి.

హైద‌ర‌బాద్.. నిత్యం ర‌ద్దీగా కనిపించే మ‌హాన‌గ‌రం. ఈ మ‌హ‌నగ‌రంలోని చాద‌ర్ ఘాట్ స‌మీపంలో ఉన్న మోటారు మెకానిక్ షాప్ లో ఓ మూల‌న కూర్చొని ప‌క్క‌న సిలిండ‌ర్ స‌హయంతో ఊపిరి పీల్చుకుంటూ త‌న ప‌ని తాను చేసుకుంటున్న ఈ వ్య‌క్తే.. మెకానిక్ మ‌క్బూల్. పేషెంట్ లా క‌నిపిస్తున్న ఈ వ్య‌క్తి ఇక్క‌డ ఉండాల్సిన అవ‌స‌రం ఏం వ‌చ్చింద‌ని మీరు అనుకోవ‌చ్చు. కానీ అస‌లు క‌థ అదే.. ఈయ‌న‌ శ్వాస, గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నాడు. రోజులో 15 గంట‌ల పాటు కృతిమ శ్వాస తో ఊపిరి పీల్చుకుంటు బ్ర‌తికీడుస్తున్నాడు. సాదార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న ఎవ‌రైనా బెడ్ కే ప‌రిమితం అవుతారు. కానీ ఇత‌రుల మీద ఆధార‌ప‌డి బ్ర‌త‌కడం ఇష్టంలేని మక్బూల్ ఇతంటి బాధను అనుభవిస్తూ కూడా తన షాప్ కు వచ్చి నడిపిస్తున్నాడు. ఊపిరి పోయేంత వ‌రకు నా కాళ్ల మీద నేనే నిల‌బ‌డ‌తా, నాకు  త‌న‌కు బాగా న‌చ్చిన మెకానిక్ ప‌నిని చేసుకుంటున్నాడు.

maqbool-final

ఈ మెకానిక్ షాపులో మ‌క్బూల్ వ‌ద్ద న‌లుగురు కుర్రాళ్లు ప‌ని చేస్తున్నారు. కృత్రిమ శ్వాస తో నెట్టుకొస్తున్న మ‌క్బూల్ ఈ న‌లుగురి కుర్రాళ్ల‌కంటే వేగంగా ప‌ని చేస్తుంటాడు. షాప్ లో ఒక సిలిండ‌ర్ ఇంటి వ‌ద్ద మ‌రో సిలిండ‌ర్ ను ఏర్పాటు చేసుకొని రోజుకు 15 గంటలు వీటి ద్వారా శ్వాస తీసుకుంటుంటాడు. ఇక రేపో మాపో త‌న ప్రాణాలు గాల్లో క‌లుస్తాయ‌ని తెలిసినా చిరున‌వ్వుతోనే సాగిపోతున్నాడు. చావును కూడా సాద‌రంగా ఆహ్వ‌నిస్తాన‌ని చెపుతున్న మ‌క్బూల్ ధైర్యం ఎంద‌రికో ఆదర్శనీయం.

Comments

comments

Share this post

scroll to top