చావుబతుకుల మధ్య ఉన్న అతను తన లవర్ కి ఏమని “లెటర్” రాశాడో తెలుసా.? చూస్తే కన్నీళ్లే.!

ప్రేమంటే అనిర్వచనీయమైనది….ఎవరి మధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదు.కొందరి మధ్య ఎన్నో ఏళ్లు పరిచయం ఉన్నా ప్రేమ పుట్టకపోవచ్చు.మరికొందరి మధ్య చూడగానే ప్రేమ పుట్టొచ్చు అదేనండి లవ్ ఎట్ ఫస్ట్ సైట్…కానీ ఒక మనిషిని ఇష్టపడకపోవడానికి రీజన్స్ చెప్పగలమేమో కానీ..ఎలాంటి రీజన్ లేకుండా కూడా అప్పుడప్పుడు ప్రేమ పుట్టేస్తుంది.అది ఎంతవరకు నిలబడుతుంది అనేది తర్వాత విషయం అనుకోండి.ఈ మధ్య యూట్యూబ్ లో ఒక షార్ట్ ఫిలిం చూసా.. సహేలీ..చూడగానే పేరు భలే ఆకట్టుకుంది..వెంటనే సహేలీ అంటే ఏంటా అని కనుక్కుంటే ప్రియురాలు అని అర్దమైంది..రిలీజైన పదిరోజుల్లోనే లక్షమంది చూసారు.ఇంతమంది చూసిన  ఆ సినిమాలో అంత గొప్పదనం ఏముందా అనుకున్నా…

ఈ సినిమాలో ముందుగా నచ్చింది..

“నేను మరణిస్తే నా ప్రేమను జ్ఞాపకంగా ఉంచుకో…
తిరిగొస్తే నీ ప్రేమను జ్ఞాపకంగా తిరిగివ్వు”…..

ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా పవరేంటో చెప్పేస్తుంది.ప్రేమకథలు ఎన్నో వస్తాయి..కానీ కొన్ని మాత్రమే మనసును తాకుతాయి.అందులో సహేలిలోని ప్రేమకథ కూడా.. ఈ సినిమాలో హీరో హీరోయిన్ పరిచయమే విభిన్నంగా జరుగుతుంది.నాకు తెలిసి  ఇది చదివే ఏ ఒక్కరికైనా కూడా ఇలాంటి స్టోరీ ఉండొచ్చు..వంద రూపాయల నోట్ పై ఉన్న HEADDEACHE అనే లెటర్సే వారిద్దరి మధ్య పరిచయం పుట్టిస్తాయి..ఈ హెడ్డెక్ లో ఏముందో సినిమా చూడకుండానే ఎవరైనా కనిపెట్టగలరా..హీరోయిన్ కనిపెట్టింది అది హీరో ఫోన్ నంబర్ అని ఇంకేముంది ఫోన్ చేసి మాటకలిపి,తర్వాత తనెవరో,ఎక్కడుంటుందో కనిపెట్టాలనే సవాల్ విసిరింది.ఈ సీన్స్ కాసేపు మనల్ని యండమూరి నవల వెన్నెల్లో ఆడపిల్లని తలపిస్తాయి..ఎట్టకేలకూ చివరికి హీరోయిన్ ని కనిపెట్టడం తనముందు ప్రత్యక్షమవడం తనని ఒన్ డే గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడగడం..దానికి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయడం..అన్ని చకచక జరిగిపోతుంటాయి..ఏంటి అరగంట సినిమాలో ఇవన్నీనా అనిపస్తుందా..అవునండీ అరగంట మాత్రమే కానీ మూడు గంటల సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది..ఆ ఒక్క రోజు పూర్తి అయిన తర్వాత యుఎస్ వెళ్తున్నా అంటూ వెళ్లిపోతాడు మన హీరో..

watch video here:

ఇంతకీ మన హీరో హీరోయిన్ కలిసారా..ఎందుకు యుఎస్ వెళ్లాడు..”నేను మరణిస్తే నా ప్రేమను జ్ఞాపకంగా ఉంచుకో…
తిరిగొస్తే నీ ప్రేమను జ్ఞాపకంగా తిరిగివ్వు”…..ఈ డైలాగ్ ఎందుకు అనాల్సొచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడండి..సినిమా అవకాశాలు రావాలంటే ఒకప్పుడు స్టూడియోల వెంబడి ,సినిమా ఆఫీసుల వెంబడి రోజుల తరబడి తిరిగే వాళ్లు కానీ ఇప్పుడు మాత్రం తమలోని టాలెంట్ నిరూపించుకోవడానికి చేతిలో చిన్న కెమెరా ఉండి,మైండ్లో మంచి థాట్ ఉంటే చాలు దాన్ని సినిమాగా తీసి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు..వెండితెరవైపు కు మార్గం సుగమం చేసుకుంటున్నారు..ఈ సినిమాకు సంభందించి హీరో హీరోయన్ పెయిర్ ,వారి నటన,డైరెక్షన్,డైలాగ్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,డిఒపి ప్రతిది కూడా సూపర్ గా ఉన్నాయి..మీరూ కూడా చూడండి..

Comments

comments

Share this post

scroll to top