బతికుండగానే “చావు పార్టీ” ఇచ్చాడు ఆ ప్రముఖ వ్యాపారవేత్త..! ఎందుకో తెలుసా..?

మరణం..మనిషిని బలహీనున్ని చేస్తుంది..ఎంతటి శక్తిమంతుడైనా చావుకి భయపడతారు.. తన వాళ్లందరిని వదిలి పోతున్నామనే బాదతో మరింత బలహీనుడవుతాడు..చావు దగ్గరపడుతున్న దగ్గరకొద్ది ధైర్యం కోల్పోయి నిరాశ నిస్ఫ్రుహలతో బతుకుతుంటారు..కానీ వీటన్నింటికి దూరంగా ఒక వ్యక్తి తనకు చావు తప్పదని తెలిసాక చావు పార్టీ ఇచ్చారు…అతనే జపాన్ కి చెందిన సతోర్ అంజకి…ఎప్పుడూ నిరాశతో బతకలేదని.. పరిపూర్ణమైన జీవితం అనుభవించానని అతను చివరిగా చెప్పిన మాటలు నిజమనిపిస్తాయి..అవును మరి చావు తప్పదని తెలిసి దాన్ని కూడా సంతోషంగా ఆహ్వనించిన అతను పరిపూర్ణ జీవితాన్నే అనుభవించాడు..

జపాన్ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త  సతోరు అంజకి… ప్రపంచవ్యాప్తంగా ఇంజినీరింగ్ మిషన్లు తయారు చేసే కొమత్సుకి అనే కంపెనీకి మాజీ అధ్యక్షుడు. సతోరు అంజకికి  గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ చేసినా ఫలితం ఉండదని.. ఆరు నెలల కంటే ఎక్కువ బతకరు అని డాక్టర్లు కూడా తేల్చిచెప్పారు.ఎనభైఏళ్ల వయసు కలిగిన అజంకి ,ఈ  వయస్సులో బాధపడి ఏం లాభం ..అందుకే తన జ్ణాపకాలను అందరితో పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. చిన్ననాటి మిత్రులు, వ్యాపార స్నేహితులు, తన కంపెనీలో పని చేసే వెయ్యి మంది ఉద్యోగులు, తన ఎదుగుదలలో సహాయసహకారాలు అందించిన అందరి లిస్ట్ రాసుకుని..అందరికి పార్టీ ఇవ్వాలనుకున్నాడు. ఎండ్ ఆఫ్ లైఫ్ పార్టీ పేరుతో  అందరికి ఇన్విటేషన్లు పంపించాడు.

బతికుండగా మళ్లీ నేను మిమ్మల్ని కలుస్తానో లేదో. ఇది నేను ఇచ్చే చివరి పార్టీ. మిమ్మల్ని మళ్లీ చూడలేను. అందరూ తప్పకుండా రండి అని ఆహ్వానించాడు. ఈ ఆహ్వానం అందుకున్న అందరూ షాక్ అయ్యారు. జపాన్ న్యూస్ పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చాడు. వ్యక్తిగతంగా ఎవరినైనా మిస్ అయితే క్షమించాలి.. ఈ ప్రకటనే ఆహ్వానంగా మన్నించి రండి అని పిలుపునిచ్చాడు. జపాన్ రాజధాని టోక్యోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ గా పార్టీ అరేంజ్ చేశాడు. అందరూ హాజరుకావాలని కోరాడు. దీంతో పార్టీకి 2వేల మందిపైనే హాజరయ్యారు. అందర్నీ పేరుపేరున పలకరించి ,షేక్ హ్యాండ్ ఇచ్చి,అందరితో ఫోటోలు దిగాడు.  నా జీవితం సంపూర్ణం కావటానికి మీ సహాయసహకారాలు మరువలేనివి అని ధన్యవాదాలు చెప్పాడు. అందరితో అనుభవాలను పంచుకున్నాడు.చివరి రోజులను ప్రశాంతంగా, హాయిగా గడపాలని కోరుకుంటున్నానని.. అందుకే అందరినీ పిలిచి పార్టీ ఇస్తున్నట్లు తెలిపాడు ఇదే చివరి చూపు, మాట కావొచ్చు అని తెలిపాడు..నిజంగా ఇలాంటి పరిపూర్ణ జీవితం ఏ కొద్దిమందో గడుపుతారు..వారిలో ఒకడే సతోరు అజంకి..

Comments

comments

Share this post

scroll to top