ఇక‌పై మీరు కొనే వ‌స్తువుల‌పై రెండు MRP స్టిక్క‌ర్లు ఉంటాయి…ఎందుకో తెలుసా..? అలా చేయకుంటే కఠిన చర్యలు!

ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి జీఎస్‌టీ బిల్లు దేశ వ్యాప్తంగా అమ‌లులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే 0, 5, 12, 18, 28 శ్లాబుల్లో జీఎస్‌టీని ఆయా వ‌స్తు సేవ‌ల‌కు వ‌సూలు చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అనేక వ‌స్తువులు, సేవ‌ల జీఎస్‌టీ శ్లాబుల‌ను కేంద్రం మార్చింది. కొన్నింటి శ్లాబుల‌ను పెంచితే చాలా వ‌ర‌కు వ‌స్తువుల శ్లాబుల‌ను తగ్గించింది. దీంతో త‌గ్గిన జీఎస్‌టీ ప్ర‌కారం ఆయా వ‌స్తువుల‌కు, సేవ‌ల‌కు ధ‌ర‌లు వ‌ర్తించ‌నున్నాయి. అయితే త‌గ్గిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా తయారీదారులు త‌మ ఉత్ప‌త్తుల‌పై ఎంఆర్‌పీ స్టిక్క‌ర్లు వేయాల‌ని కేంద్ర క‌న్‌జ్యూమ‌ర్ ఎఫెయిర్స్ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కంపెనీల‌కు సూచించారు.

ఈ ఏడాది జూలై 1వ తేదీ త‌రువాత త‌యారు చేసిన వ‌స్తువుల‌కు గాను స‌వ‌రించిన జీఎస్‌టీ ప్ర‌కారం త‌గ్గింపు లేదా పెరిగిన ధ‌ర‌ల‌తో కూడిన కొత్త ఎంఆర్‌పీ స్టిక్క‌ర్ల‌ను కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌పై వేయాలి. ఇందుకు డిసెంబ‌ర్ నెల వ‌ర‌కు గ‌డువిచ్చారు. అయితే కొత్త‌గా వేసే ఎంఆర్‌పీ స్టిక్క‌ర్‌కు తోడుగా పాత ఎంఆర్‌పీ స్టిక్క‌ర్‌ను కూడా అలాగే ఉంచాలి. దీంతో వినియోగ‌దారుల‌కు జీఎస్టీ వ‌ల్ల‌ ఏ వ‌స్తువుల‌పై ఎంత ధ‌ర‌ పెరిగింది, ఎంత త‌గ్గింది అనే విష‌యం సుల‌భంగా తెలుస్తుంది.

ఈ క్ర‌మంలోనే కంపెనీలు కొత్త ఎంఆర్‌పీ స్టిక్క‌ర్ల‌ను క‌చ్చితంగా త‌మ ఉత్ప‌త్తుల‌పై వేయాల్సిందేన‌ని మంత్రి పాశ్వాన్ చెప్పారు. అందుకు గడువు డిసెంబ‌ర్ వ‌ర‌కు విధించామ‌ని అన్నారు. ఆ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌క‌పోతే కంపెనీల‌పై చ‌ర్యలు తీసుకుంటామ‌ని అన్నారు. క‌నుక ఇప్ప‌టి నుంచి మీరు కొనే వ‌స్తువుల‌పై పాత, కొత్త ఎంఆర్‌పీ స్టిక్క‌ర్లు ఉన్నాయో లేదో చూడండి. లేదంటే ధ‌ర త‌గ్గినా పాత ధ‌ర‌తోనే (ఎక్కువ ధ‌ర‌తోనే) ఆయా వ‌స్తువుల‌ను మీకు విక్రయించ‌వ‌చ్చు. దీంతో అన‌వ‌స‌రంగా డ‌బ్బు న‌ష్ట పోవాల్సి వ‌స్తుంది. క‌నుక వ‌స్తువుల‌ను కొనేట‌ప్పుడు ఈ విష‌యాన్ని ఒక సారి గ‌మ‌నించండి..!

Comments

comments

Share this post

scroll to top