ఇక రంగంలోకి ఫ్లాస్టిక్ నోట్లు…10/- లతో స్టార్ట్!?

పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌ధాని మోడీ న‌ల్ల కుబేరులు, అవినీతి ప‌రుల‌పై ఎంత‌టి బాంబ్ పేల్చారో అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో సాధార‌ణ జ‌నాలైతే క‌ష్టాలు ప‌డుతున్నారు కానీ న‌ల్ల బాబులు మాత్రం ఇంకా బ‌య‌టికి రావ‌డం లేదు. దేశంలో ఎక్క‌డో ఒక చోట కొత్త క‌రెన్సీ నోట్లు పెద్ద ఎత్తున ల‌భ్య‌మ‌వుతున్నాయి కానీ, అవినీతి పరులు మాత్రం త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల ధ‌నాన్ని ఇంకా బ‌య‌టికి చెప్ప‌డం లేదు. దీని సంగ‌తి ఎలా ఉన్నా ఓ ర‌కంగా న‌కిలీ క‌రెన్సీకి మాత్రం ఫుల్‌గా చెక్ పెట్టిన‌ట్టే అని అంటున్నారు ఆర్థిక విశ్లేష‌కులు. ఈ క్ర‌మంలో అలాంటి న‌కిలీ క‌రెన్సీని చెలామ‌ణీ చేసేవారి నెత్తిన మ‌రో పిడుగు ప‌డ‌నుంది..!

plastic-currency
కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌రలో ప్లాస్టిక్ క‌రెన్సీ నోట్ల‌ను వినియోగంలోకి తీసుకురానుంది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ‌వాల్ తాజాగా జ‌రుగుతున్న పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో వెల్ల‌డించారు. ప్లాస్టిక్ లేదా పాలిమ‌ర్‌తో ఈ క‌రెన్సీ నోట్ల‌ను ముద్రిస్తామ‌ని ఆయ‌న అన్నారు. ముందుగా రూ.10 నోట్ల‌ను రూ.100 కోట్ల వ‌ర‌కు ముద్రిస్తామని, రానున్న 2017 ఫిబ్ర‌వ‌రి నెల వ‌ర‌కు ఎంపిక చేసిన ప్ర‌ధాన న‌గరాల్లో మాత్రమే ముందుగా ఈ నోట్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని, అనంత‌రం ఇత‌ర అన్ని ప్రాంతాల‌కు ఇవి స‌ర‌ఫ‌రా అవుతాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అంతేకాదు, ఇలా త‌యారు చేసిన ప్లాస్టిక్ క‌రెన్సీ నోట్ల జీవిత కాలం 5 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఉంటుంద‌ని, అనంత‌రం అవి ప‌నికిరావ‌ని, క‌నుక న‌ల్ల కుబేరులు డ‌బ్బును దాచినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని చెప్పారు.

అత్యంత సెక్యూరిటీతో ముద్రితం కానున్న ఈ కొత్త ప్లాస్టిక్ క‌రెన్సీ నోట్లకు న‌కిలీల‌ను సృష్టించ‌డం కూడా అంత ఆషామాషీ కాద‌ట‌. ఎందుకంటే పేప‌ర్ క‌రెన్సీకి, ప్లాస్టిక్ కరెన్సీకి చాలా వ్య‌త్యాసం ఉంటుంద‌ట‌. దీంతో న‌కిలీల‌ను ఎవ‌రైనా ఇట్టే సుల‌భంగా గుర్తించ‌గ‌లుగుతారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం అందుబాటులోక తీసుకురానున్న కొత్త ప్లాస్టిక్ క‌రెన్సీ ఆస్ట్రేలియా దేశ క‌రెన్సీని పోలి ఉంటుంద‌ట‌. దాని మోడ‌ల్‌లోనే మ‌న క‌రెన్సీని త‌యారు చేస్తున్న‌ట్టు స‌మాచారం. నిజంగా ప్లాస్టిక్ క‌రెన్సీ అందుబాటులోకి వ‌స్తే… న‌కిలీల బెడ‌దైతే అస్స‌లు ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు, అంతేకాదు, వారు చెబుతున్న‌ట్టుగా స‌ద‌రు క‌రెన్సీ జీవిత కాలం 5 ఏళ్లు మాత్ర‌మే క‌నుక ఎవ‌రూ కూడా పెద్ద ఎత్తున డ‌బ్బులు పోగు చేసే చాన్స్ కూడా ఉండ‌దు..! నిజంగా భ‌లే ఐడియా క‌దా..!

Comments

comments

Share this post

scroll to top