కార్ బంప‌ర్స్ ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఉంటే…2000 వ‌ర‌కు ఫైన్.! పూర్తి డీటైల్స్ మీకోసం.!

కారు య‌జ‌మానులు త‌మ త‌మ కార్ల‌ను త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా మోడిఫై చేయించుకోవ‌డం స‌హ‌జ‌మే. కారు లోప‌ల‌, బ‌య‌ట ప‌లు మోడిఫికేష‌న్స్ చేయించుకుని త‌మ‌కు అనుకూలంగా, త‌మ ఇష్టాల‌కు త‌గిన‌ట్టుగా కార్ల‌ను మార్చుకుంటారు. దీంతో వారు చాలా కంఫ‌ర్ట్ ఫీల‌వుతారు. ఇంకా కొంద‌రు అయితే లుక్ కోస‌మే కార్ల‌కు అలా మోడిఫికేష‌న్స్ చేయిస్తారు. అయితే కార్ మోడిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే చాలా మంది చేయించే కామ‌న్ మోడిఫికేష‌న్ ఒక‌టుంది. అదే కార్ బంప‌ర్‌. అవును, అదే. చాలా మంది కంపెనీ ఇచ్చిన బంప‌ర్ కాకుండా బాగా పెద్ద‌గా ఉండే బంప‌ర్ల‌ను కార్ల‌కు ఫిట్ చేయించుకుంటారు. దీంతో కారు యాక్సిడెంట్ అయినప్పుడు ముందు భాగం పెద్ద‌గా డ్యామేజ్ అవ‌కుండా ఉంటుంద‌ని వారు న‌మ్ముతారు. అయితే ఇక‌పై అలాంటి పెద్ద బంప‌ర్ల‌ను ఫిట్ చేయరాదు. ఉన్నా తీసేయాల్సిందే. ఎందుకంటే…

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా వాహ‌నదారుల‌కు ఓ కొత్త రూల్‌ను అమ‌లులోకి తెచ్చింది. మోటారు వాహ‌నాల చ‌ట్టం ప్ర‌కారం ఇక‌పై కారు బంప‌ర్ల‌ను మార్చ‌కూడ‌దు. పెద్ద బంప‌ర్ల‌ను ఫిట్ చేయ‌రాదు. కారుతో వ‌చ్చిన డిఫాల్ట్ బంప‌ర్ల‌నే వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా కొత్త‌గా వేరే బంప‌ర్ల‌ను ఫిట్ చేసినా, లేదంటే ఇప్పటికే ఉన్న వారు బంప‌ర్ల‌ను తీసేయ‌క‌పోయినా రూ.1000 నుంచి రూ.2000 వ‌ర‌కు ఫైన్ ప‌డుతుంది. ఇక‌పై అన్ని రాష్ట్రాల్లోనూ ఈ రూల్‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే కేంద్రం రాష్ట్రాల‌కు ఆదేశాల‌ను జారీ చేసింది.

అయితే ఈ కొత్త రూల్‌ను కేంద్రం ఎందుకు అమ‌లు చేయ‌నుందో తెలుసా..? అందుకు బ‌ల‌మైన కార‌ణం ఉంది. అదేమిటంటే… కారుకు ముందు భాగంలో బంప‌ర్ల‌ను ఫిట్ చేయ‌డం వ‌ల్ల అక్క‌డ ఉండే సెన్సార్లు ప‌నిచేయ‌వు. దీంతో కారు లోప‌ల ఉండే ఎయిర్ బ్యాగ్స్ స‌మ‌యానికి తెరుచుకోవు. యాక్సిడెంట్ అయిన‌ప్పుడు సెన్సార్లు ప‌నిచేయ‌క‌పోతే ఎయిర్ బ్యాగులు తెరుచుకోవు. అందు వ‌ల్ల యాక్సిడెంట్ అయిన‌ప్పుడు మ‌న‌కు ప్ర‌మాద తీవ్ర‌త పెరుగుతుంది. దీన్ని నివారించేందుకే కార్ల‌కు బంప‌ర్ల‌ను ఫిట్ చేయడాన్ని నిషేధించారు. క‌నుక మీరు కూడా ఈ రూల్‌ను ఫాలో అయిపోండి.

Comments

comments

Share this post

scroll to top