17ఏళ్లుగా ఆ 8 గ్రామాల ప్రజలు “దివాళి” ఎంత భిన్నంగా జరుపుకుంటున్నారో తెలుసా.? మనమూ ఫాలో అవుదాం!

చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి,మన జీవితమే ఒక దీపావళీ… దీపావళి అంటే అర్దం ఏంటో తెలుసా..దీపాల వరుస అని..కానీ దీపావళి అర్దాన్నే కాదు,పండుగల పరమార్దాన్నే మార్చేస్తున్నాం మనం..ఎన్ని టపాసులు,ఎంతపెద్ద బాంబులు కాలిస్తే అదే దీపావళి..మనం చేసుకునే పండుగ వలన ఎవరికి నష్టం జరిగితే మనకుఏంటి..పండుగ మాత్రం ధూమ్ ధామ్ గా చేయాల్సిందే..మనం చేస్తున్న దానివలన మన పర్యావరణానికి ముప్పు అని తెలిసినా ఏడాదికి ఒకసారేగా అని సమర్ధించుకుంటాం..అలా సమర్దించుకునే వాళ్లంతా ఒకసారి తమిళనాడులోని,ఇరోడ్ జిల్లా గురించి తెలుసుకోవాల్సింది…

ఒకటి,రెండేళ్లు కాదు  ఏకంగా పదిహేడేండ్లుగా నిశ్శబ్ద దీపావలి జరుపుకుంటున్నారు అక్కడ ప్రజలు..దేని గురించో తెలుసా..కొన్ని మూగజీవాల గురించి,అది కూడా అక్కడ వారు పెంచుకునే  జంతువులో,పశువుల గురించో కాదు ,ఏటా వలసోచ్చే పక్షుల గురించి..అక్కడ ఒక చిన్న మతాబు పేల్చక ఎన్నో ఏళ్లయింది. కాకరపూవొత్తులు కూడా వెలిగించరు.ఇప్పుడిప్పుడే పిల్లల సరదా కాదనలేక వెన్నెల  తాళ్లలాంటి చిన్న చిన్న టపాసులు ఇస్తున్నారు.

కొంగునాడు ప్రాంతంలో ఉన్న ఈ జిల్లాలో తమిళం, తెలుగుతో కలిపి ఎనిమిది భాషలు మాట్లాడుతారు. భిన్న భాషల సమ్మేళనంగా ఉన్న ఈ జిల్లా ప్రజల మనసు బంగారం. అందునా ప్రత్యేకంగా వెళోడ్ బర్డ్స్ శాంక్చువరీ చుట్టూ ఉన్న 8 గ్రామాల ప్రజల హృదయమైతే వెన్నకన్నా మెత్తనిది.ఇక్కడ మొత్తం 750 గడపలుంటాయి. వారంతా సుమారు 80 హెక్టార్లలో పరుచుకున్న పక్షుల సంరక్షణ కేంద్రం చుట్టూ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు.అక్కడికి వలస పక్షులు సీజన్ల వారీగా వస్తుంటాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి పెద్ద ఎత్తున వస్తుంటాయి. అక్కడే గూడు కట్టుకుని, గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలతో సొంత దేశానికి ఎగిరిపోతాయి. అవన్నీ మూడు నెలలపాటు  శాంక్చువరీలో ఉంటాయి.దీపావళినాడు పెద్దపెద్ద టపాసులు కాలిస్తే అవి బెదిరిపోతాయోమో అనే భయంతో నిశ్శబ్ద దీపావలి జరుపుకుంటున్నారు.ఇతరుల కోసం మన సంతోషాలను ఎందుకు కాదనుకోవాలి అనుకునే మనుషులున్న మన సమాజంలో,నోరు లేని పక్షుల కోసం తమ ఆనందాన్ని త్యాగం చేస్తున్న వీళ్లు నిజంగా గొప్పవాళ్లు కదా…

Comments

comments

Share this post

scroll to top