టెన్త్ పేపర్ లీక్ అవ్వడంతో మరోసారి ఆ రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు.! మొత్తంగా 28లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు మళ్లీ

CBSE సంచలన నిర్ణయం తీసుకున్నది. పేపర్ లీక్ అయిన రెండు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. 10వ తరగతి మ్యాథ్స్ (గణితం), 12వ తగరతి ఎకనామిక్స్ పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు నిర్ధారించారు. పరీక్ష సమయంలో లీక్ వార్తలు కలకలం రేపాయి. దీనిపై విచారణ కూడా వేశారు. పేపర్లు ఎగ్జామ్ కంటే ముందే బయటకు వచ్చినట్లు విచారణలో కూడా నిర్ధారణ కావటంతో.. మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు CBSE ప్రకించింది. స్టూడెంట్స్ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్షల విధానంలో పారదర్శకత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది.

పదో తరగతిలో 16లక్షల 38వేల 428 మంది హాజరయ్యారు. 12వ తరగతిలో 11లక్షల 86వేల 306 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. మొత్తంగా 28లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు మళ్లీ ఈ రెండు పరీక్షలు రాయాల్సి ఉంది. ఎగ్జామ్ తేదీలు ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. వారం రోజుల్లో తేదీలను వెబ్ సైట్ ద్వారా వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్టుగా విద్యార్థులు సిద్ధంగా ఉండాలని కోరారు.

Comments

comments

Share this post

scroll to top