మనదేశంలోని చాలా మంది మహిళలు, అమ్మాయిలకు వారి వారి శరీరాల సైజ్ మరియు షేప్ ల మీద దృష్టి పెట్టరు. పర్ఫెక్ట్ షేప్స్ అయిన 36-24-36 కొలతలు రావాలంటే ఆటలు, వ్యాయామాలు చేయాలి. ఈ 36-24-36 కొలతలే అత్యుత్తమ శరీరాకృతివి… అంటూ 12 వ తరగతి CBSE బుక్స్ లో ఉండడం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అమ్మాయిల అందమైన కొలతలు ఇవే అంటూ చెప్పడం, వాటికి తోడు బుక్స్ లో ఉన్న బొమ్మలు చూస్తే…ఇది విజ్ఞానాన్ని అందించే పుస్తకమా? లేక అమ్మాయిల ఫిట్ నెస్ రహస్యాలను చెప్పే చాప్టరా? అని చాలా మంది నెటీజన్లు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ ఫోటోలపై, ఈ కొలతలపై పెద్ద చర్చే నడుస్తోంది. సెక్స్ ఎడ్యుకేషనే తప్పు కానప్పుడు, ఈ కొలతలు ఎలా తప్పు అవుతాయని కొందరు, మంచిని ప్రబోధించాల్సిన పుస్తకాలు…ఇలా అంగవర్ణనను, స్త్రీల కొలతలను లెక్కేయడం ఏంటని కొందరు… తమ తమ వాదనలను వినిపిస్తున్నారు.
12వ తరగతి సీబీఎస్ఈ సిలబస్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ లో “ఫిజికల్ అండ్ అనాటమికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్” అనే చాప్టర్ లో ఈ వివరాలున్నాయి.