ఆ రకానికి చెందిన మిర‌ప పొడిని తీసుకుంటే హార్ట్ ఎటాక్స్ రావ‌ట‌.!?

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది బాధ‌ప‌డుతున్న వ్యాధుల్లో హార్ట్ ఎటాక్ కూడా ఒక‌టి. అది ఎప్పుడు వ‌స్తుందో, ఎలా వ‌స్తుందో తెలియ‌దు. కానీ ఒక‌సారి వ‌స్తే మాత్రం గుండెకు చాలా తీవ్ర‌మైన న‌ష్టం క‌లుగుతుంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్‌ల కార‌ణంగా ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఒక్క అమెరికాలోనే ఏటా 6 ల‌క్ష‌ల మంది హార్ట్ ఎటాక్స్ కార‌ణంగా మ‌ర‌ణిస్తున్నారు. మ‌రో 7.20 ల‌క్ష‌ల మంది కొత్త‌గా హార్ట్ ఎటాక్‌ల బారిన ప‌డుతున్నారు. మొద‌టి సారి హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ప్పుడే వీలైనంత ఎక్కువ శ్ర‌ద్ధ వహిస్తే గుండెకు జ‌రిగే న‌ష్టాన్ని అధిగ‌మించ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. కాగా ఒక‌సారి హార్ట్ ఎటాక్‌కు గురైన వారు మాత్రం ఇక ఎప్ప‌టికీ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందేన‌ని వారు అంటున్నారు. ఈ క్ర‌మంలో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసేందుకు అధిక శాతం మంది మెడిసిన్స్ మీద ఆధార ప‌డ‌డం, నిత్యం వ్యాయామం చేయ‌డం, త‌గిన పౌష్టికాహారం తీసుకోవ‌డం వంటి జాగ్ర‌త్త‌లు వ‌హిస్తున్నారు. అయితే వాట‌న్నింటితోపాటు కయాన్ పెప్ప‌ర్ (Cayenne Pepper) అనే ఓ ప్రత్యేక‌మైన మిర‌ప‌కాయ పొడిని నిత్యం తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చ‌ట‌. డాక్ట‌ర్ జాన్ క్రిస్ట‌ఫ‌ర్ అనే ఓ వైద్యుడు త‌న బృందంతో క‌లిసి చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తాజాగా ఈ విష‌యం వెల్ల‌డైంది.

cayenne-pepper

క‌యాన్ పెప్ప‌ర్‌లో క్యాప్సెయిసిన్ (Capsaicin) అనే ఓ ర‌సాయ‌నం ఉంటుంది. అది ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డం, కొవ్వు చేర‌డం వంటి ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని క‌రిగిస్తుంది. ఈ క్ర‌మంలో డాక్ట‌ర్ జాన్ క్రిస్ట‌ఫ‌ర్ ప‌లువురు పేషెంట్ల‌కు క‌యాన్ పెప్ప‌ర్‌తో త‌యారు చేసిన టీని త‌ర‌చూ ఇచ్చాడు. ఒక క‌ప్పు వేడి నీటిలో కొద్దిగా క‌యాన్ పెప్ప‌ర్ పొడిని వేసి టీలా మ‌రిగించి పేషెంట్ల‌కు ఆయ‌న ఇచ్చాడు. దీంతో వారి ర‌క్త నాళాల్లో ఉన్న అడ్డంకుల‌న్నీ తొల‌గిపోయాయి. డాక్ట‌ర్ జాన్ క్రిస్ట‌ఫ‌రే స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే ఈ విష‌యం వారికి ఎలా తెలిసిందంటే, హార్ట్ ఎటాక్స్ వంటివి వ‌చ్చిన‌ప్పుడు పేషెంట్ల‌కు తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డం కోసం, గుండెకు జ‌రిగే న‌ష్టాన్ని నివారించేందుకు పైన చెప్పిన క్యాప్సెయిసిన్ ర‌సాయ‌నం ఉండే పెయిన్ కిల్ల‌ర్స్‌ను వారి చ‌ర్మంపై రుద్దేవారు. దీంతో ఆ ర‌సాయ‌నం గుండె పోటుకు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంద‌ని వారికి అప్పుడే తెలిసింది. అలా ఆ ర‌సాయ‌నం వేటిలో ఉంటుంద‌ని ప‌రిశోధ‌న చేయ‌గా, అది క‌యాన్ పెప్ప‌ర్‌లో త‌గిన మోతాదులో ఉంటుంద‌ని తెలిసింది. దీంతో ఆ పెప్ప‌ర్‌ను మ‌ళ్లీ ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించి డాక్ట‌ర్ జాన్ క్రిస్టోఫ‌ర్ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఆ పెప్ప‌ర్‌ను త‌ర‌చూ వాడితే ర‌క్త నాళాల్లో ఉన్న అడ్డంకులు తొల‌గిపోతాయ‌ని, గుండె పోటు రాద‌ని, ఇప్ప‌టికే గుండె పోటు వ‌చ్చిన వారు కూడా దాన్ని వాడితే భ‌విష్య‌త్తులో హార్ట్ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని చివ‌ర‌కు ఆయ‌న తెలియ‌జేశారు.

కాగా మెక్సికో, ఇట‌లీతోపాటు ఆసియాకు చెందిన ప‌లు దేశాల్లో ఈ క‌యాన్ పెప్ప‌ర్‌ను ఎక్కువ‌గా వాడ‌తార‌ట‌. ఈ క్ర‌మంలో ఆయా దేశ‌స్తులకు హార్ట్ ఎటాక్స్ కూడా ఎక్కువ‌గా రావ‌డం లేద‌ని ప‌లు ప‌రిశోధనా సంస్థ‌లు తెలియ‌జేశాయి. అయితే క‌యాన్ పెప్ప‌ర్‌ను ఈ విధంగా గుండె పోటు స‌మ‌స్య‌కు ఉప‌యోగించ‌డం ప‌ట్ల మెడిసిన్ల‌ను త‌యారు చేసే ఆయా కంపెనీలు ఇంకా ఓ ధ్రువీక‌ర‌ణ‌కు రాలేద‌ట‌. దానిపై ఇంకా ప‌రిశోధ‌న‌లు చేయాల్సి ఉంద‌ట‌. ఈ క్ర‌మంలో వైద్యుల స‌ల‌హా లేకుండా క‌యాన్ పెప్ప‌ర్‌ను అలా వాడితే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంద‌ట‌. సో, త్వ‌ర‌లోనే ఈ తతంగ‌మంతా ఓ ముగింపుకు వ‌స్తే అప్పుడు క‌యాన్ పెప్ప‌ర్‌ను గుండె పోటుకు ఔష‌ధంగా ఉపయోగించ‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఏది ఏమైనా అలాంటి అద్భుత ఔష‌ధ గుణం ఉన్న పెప్ప‌ర్‌ను క‌యాన్ పెప్ప‌ర్ కాదు, మెడిసిన్ పెప్ప‌ర్ అనాల్సిందే! ఏమంటారు!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top