అది మధ్యప్రదేశ్లోని సాగర్ రైల్వేస్టేషన్… కదులుతున్న ట్రైన్ ను ఎక్కే ప్రయత్నం చేసింది ఓ మహిళ. ట్రైన్ ఎక్కే ప్రయత్నం లో కాలు జారి ఫ్లాట్ ఫాం కు, రైలు పట్టాలకు మద్య ఉండే చిన్న సందులో పడిపోయింది. అందరూ చనిపోయిందనుకున్నారు కానీ అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడింది.. పట్టాలకు , ఫ్లాట్ ఫామ్ కు మద్య ఉన్న గ్యాప్ లో ఒక సైడ్ కు పడడంతో ఆమె బతకగలిగింది లేక పోతే ట్రైన్ చక్రాల కిందపడి ఆమె దేహం నుజ్జునుజ్జు అయ్యి ఉండేది.
స్పందించిన ప్రయాణికులు వెంటనే ట్రైన్ ను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయినా కదిలే బస్సును ఎక్కడమే రిస్క్ అలాంటిది….రన్నింగ్ ట్రైన్ ను ఎక్కే ప్రయత్నం చేయడం సహసమే. ఈ ఘటన చూసిన తర్వాత.. అటువంటి రిస్క్ చేసే వాళ్లు మారాలి. లేటైనా గమ్యం చేరుకోవొచ్చు. కానీ ప్రాణాలే పోతే…. మీ కోసం ఆశగా ఎదురుచూసే మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఒక్క సారి ఆలోచించండి.