క్యాష్ పోగ్రామ్ లో సుమకి తప్పినా భారీ ప్రమాదం. అసలు ఏమైనదంటే ..?

యాంకర్ సుమ గురించి టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేరళ అమ్మాయి అయినా సుమ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అంతేకాక యాంకరింగ్ రంగంలో టాప్ పొజిషన్ లో ఉంది. చక్కని  వ్యాఖ్యానం,సమయస్ఫూర్తి,చిరునవ్వులతో కార్యక్రమాన్ని రక్తి కట్టించటంలో సుమ అందే వేసిన చేయి. తెలుగు,మలయాళం,హిందీ,ఇంగ్లిష్ భాషలలో మాట్లాడుతుంది. పంచావతారం,స్టార్ మహిళ, భలే చాన్సలే వంటి కార్యక్రమాలలో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు పొందింది. టీవీలో యాంకరింగ్ చేస్తూ సినిమా ఆడియో వేడుకలకు కూడా యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబందించిన ప్రతి కార్యక్రమానికి సుమ యాంకరింగ్ ఉండాల్సిందే.

ఈ టీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళ వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. మొన్న ఒక ప్రముఖ ఛానల్ లో వస్తున్న కార్యక్రమంలో సుమకు పెద్ద ప్రమాదమే తప్పింది. సుమ చేస్తున్న షో లావు క్యాష్ ఒకటి. ఈ కార్యక్రమం మంచి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. సెలబ్రెటీలతో సందడి చేసే ఈ కార్యక్రమంలో డాన్స్ చేస్తూ పడిపోయింది సుమ.

నిర్వాహకులు వెంటనే రియాక్ట్ అయ్యి సుమ దగ్గరకు వచ్చి లేపటానికి ప్రయత్నం చేసారు. అక్కడకు వచ్చిన సుమ అభిమానులు షాక్ అయ్యారు. వారికి తన మీద ఉన్న ప్రేమను చూసి సుమకు ఈ ఐడియా వచ్చిందేమో కానీ ఈ ఏక్సిడెంట్ సీన్ ని ప్రోమోలో పెట్టి తన మార్కెటింగ్ స్ట్రాటజీని చాటుకుంది సుమ.ఈ ప్రోమో చూసిన వారు సుమకు ఏమైంది…ఎలా జరిగిందంటూ ఆ కార్యక్రమాన్ని చూస్తారని,అద్భుతమైన TRP లు వస్తాయని సుమ ప్లాన్ వేసిందని అంటున్నారు. చూడాలి మారి ఈ క్యాష్ కార్యక్రమం ఎంత TRP ని సాధిస్తుందో ?

Comments

comments

Share this post

scroll to top