తనను మానసికంగా చిత్ర హింసలు పెడుతున్నారంటూ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల మీద , అతని భార్య రూప బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు అతనిపై 498 A కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇటీవలే విడుదలైన బ్రూస్ లీ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు అయితే అతని భార్య కాస్టూమ్ డిజైనర్ గా వ్యవహరించిందంట.. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఇద్దరి మద్య బేధాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే ఈ కేసు పెట్టి 20 రోజులు కావొస్తుందంట, తాజాగా మా ఇద్దరి మద్య సఖ్యత కుదిరిందంటూ కేసును వాపసు తీస్కోవాలని భావించగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు కావటంతో ఇప్పుడు కేసు మా పరిధిలో లేదని, కోర్టు తీర్పు కోసం వేచి చూడాలని పోలీసులు సమాధానమిచ్చారని తెలుస్తుంది. !