పవన్ కళ్యాణ్ కు వ్యతిరేఖంగా జూబ్లిహిల్స్ పోలీస్టేషన్ లో పిర్యాదు అందింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పవన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ తెలంగాణ న్యాయవాదుల సంఘం పవన్ పై పిర్యాదు చేసింది. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 మీద.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి పవన్ నిన్న తన అభిప్రాయాలను తెలియజేశారు.
ఆ సమయంలో పవన్ మాట్లాడిన మాటలు ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఉన్నాయని ఆ పిర్యాదు లో పేర్కొన్నారు. మరోవైపు పవన్ స్పీచ్ పై తెలుగు దేశం నాయకులు కూడా మండిపడుతున్నారు. టిడిపి ఎంపి కొనకళ్ళ నారాయణ పవన్ తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని అవి తమ పార్టీ కి బాగా తెలుసని అన్నారు. మరోవైపు సోమిరెడ్డి కూడా పవన్ పై ఫైర్ అయ్యారు.
CLICK: పవన్ ను దించేశాడు.