జబర్దస్త్ షో నిర్వాహకుల మీద కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించిన కోర్ట్.!

ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ మరోమారు చిక్కుల్లో పడింది. ఈ కామెడీ షో నిర్వాకులపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…………కరీంనగర్ కు చెందిన అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ గతంలో జబర్థస్త్ షోలో  న్యాయవ్యవస్థను కించపరుస్తూ  ఓ స్కిట్‌  ప్రసారం చేశారంటూ జబర్దస్త్ టీంకు వ్యతిరేకంగా కరీంనగర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హుజూరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేస్తూ ఆ కామెడీ షో నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని  పోలీసులను  ఆదేశించింది. గతంలో కూడా గౌడ కులస్థులను అవమానించారంటూ ఈ షో పై పెద్ద దుమారమే నడిచింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో జబర్దస్త్ అడల్ట్ కామెడీని ప్రమోట్ చేస్తుందనే విమర్శలూ ఉన్నాయి.

JABARDAST SKIT ON COURT: 

Comments

comments

Share this post

scroll to top