పాపం ఆ కార్మిక మహిళలు!…ఉదయం రోడ్డు ఊడుస్తుండగా వారిపైనుండి దూసుకుపోయిన “కార్ (క్యాబ్)”

తెల్లవారు జామునే రోడ్లు ఊడుస్తుంటారు కార్మిక మహిళలు. పాపం వారి జీవితం ఎంతో కష్టాంగా ఉంటుంది. చలి కాలం, ఎండా కాలం సంబంధం లేకుండా శ్రమిస్తూ ఉంటారు వారు. రోడ్లపై కార్మిక మహిళలు ఊడ్చుతుంటే.. పక్కకు జరిగి మరీ వెళతాం. కాసేపు ఆగుతాం. అప్పుడప్పుడు వారు చాయ్ తాగడానికి డబ్బులు కూడా ఇస్తుంటారు కొందరు.

అలంటి శ్రామికుల పై ఓ కారు దూసుకెళ్లింది. ర్యాష్ డ్రైవింగ్ తో బీభత్సం చేశాడు ఆ కార్ డ్రైవర్. హైటెక్ సిటీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామునే రోడ్లు శుభ్రం చేస్తున్నారు ఇద్దరు మహిళా కార్మికులు. స్పీడ్ గా వచ్చిన కారు వాళ్లను ఢీకొట్టింది. యాక్సిడెంట్ లో మంజుల, శాంతమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుకు ఇరువైపుల క్లీన్ చేస్తున్నారు వీరు. గాయపడినవారిని చుట్టుపక్కవాళ్ళు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇద్దరు మహిళలకు తలకి, కాళ్ళకి తీవ్ర గాయాలు అవ్వడంతో పరిస్థితి విషంగా ఉందని డాక్టర్లు చెప్పారు. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము అని చెప్పారు!

watch video here:

Comments

comments

Share this post

scroll to top