ఎయిర్‌పోర్టుకు వెళ్దామ‌ని ఆ మ‌హిళ క్యాబ్ బుక్ చేసింది..కారులో డ్రైవ‌ర్ నీచమైన ప‌ని చేశాడు. చివ‌రికి ఏమైందంటే..?

ఛీ.. ఛీ… ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా.. క‌ఠిన శిక్ష‌లు వేస్తున్నామ‌ని చెప్పుకుంటున్నా.. కొంద‌రు ప్ర‌బుద్ధులు మాత్రం ఇంకా నీచ‌మైన ప‌నులు చేయ‌డం మాన‌డం లేదు. ఆడ‌వారు క‌నిపిస్తే చాలు, అస‌భ్య‌క‌రమైన ప‌నులు చేస్తున్నారు. ప‌త్రిక‌ల్లో రాయ‌డానికి, చాన‌ళ్ల‌లో చూపించ‌డానికే సిగ్గు ప‌డేలా అత్యంత నీచ‌మైన ప‌నుల‌కు ఒడిగ‌డుతున్నారు. హైద‌రాబాద్ కు చెందిన ఓ క్యాబ్ డ్రైవ‌ర్ కూడా తాజాగా ఇలాంటి ప‌నే చేశాడు. దీంతో క‌ట‌క‌టాల పాల‌య్యాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఆమె పేరు ఉమా శ‌ర్మ‌. వ‌య‌స్సు 25 సంవ‌త్స‌రాలు. ఈ మ‌ధ్యే ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చింది. అయితే ఈ నెల 19వ తేదీన దీపావ‌ళి సంద‌ర్భంగా ఢిల్లీ వెళ్దామ‌ని ఆమె నిర్ణ‌యించుకుంది. అందులో భాగంగానే ఉద‌యం విమాన టిక్కెట్ల‌ను బుక్ చేసుకుంది. హైద‌రాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునేందుకు ఆ రోజున ఉద‌యాన్నే ఊబ‌ర్ క్యాబ్ బుక్ చేసింది. అయితే కొంత దూరం వెళ్లాక క్యాబ్ డ్రైవ‌ర్ ఔట‌ర్ రింగ్ రోడ్డుపైకి కారును పోనిచ్చాడు. సాధారణంగా ఓఆర్ఆర్‌పై ఏ వాహ‌న‌మైనా చాలా వేగంగా వెళ్తుంది. కానీ అందుకు భిన్నంగా ఆ క్యాబ్ డ్రైవ‌ర్ కారు వేగాన్ని బాగా త‌గ్గించి గంట‌కు 50 కిలోమీట‌ర్లు మాత్ర‌మే న‌డ‌ప‌సాగాడు.

అలా ఆ క్యాబ్ డ్రైవ‌ర్ కారు న‌డుపుతూ రియ‌ర్ వ్యూ మిర్ర‌ర్‌లో ప‌దే ప‌దే వెనుక కూర్చున్న ఉమా శర్మ‌ను చూడ‌సాగాడు. దీంతో ఆమెకు అనుమానం వ‌చ్చి ముందుకు చూడ‌గా, ఆ డ్రైవ‌ర్ అప్పుడే త‌న సీట్లో హ‌స్త ప్ర‌యోగం స్టార్ట్ చేశాడు. దీంతో ఆమె కారును ఆప‌మ‌ని పోలీసుల‌కు ఫోన్ చేస్తాన‌ని బెదిరించింది. అలా బెదిరించే స‌రికి ఆ డ్రైవ‌ర్ తాను చేస్తున్న నీచ‌మైన ప‌ని మానేసి కారును ఎయిర్ పోర్టుకు పోనిచ్చాడు. ఈ క్ర‌మంలో ఉమా శ‌ర్మ ఎయిర్‌పోర్ట్‌లో దిగి విమానం ఎక్కి ఢిల్లీకి చేరుకుంది. వెంట‌నే అక్క‌డి స‌ఫ్దార్‌జంగ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు సైబ‌రాబాద్ పోలీసుల‌ను సంప్ర‌దించ‌గా, వారు డ్రైవ‌ర్‌ను కారు నంబ‌ర్ ఆధారంగా ట్రేస్ చేశారు. వెంట‌నే అత‌న్ని అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. ఇక ఇప్పుడు మీరే చెప్పండి. నిజంగా ఇలాంటి వారిని ఏం చేయాలో..! ఇలా చేసే వారినైతే ఊరికే వ‌దిలి పెట్ట‌కూడ‌దు, గ‌ట్టిగా బుద్ధి చెప్పాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top